ఓరి దేవుడోయ్ .. ఈ విచిత్రం చూసారా .. అప్పుడు సుమతో రాజీవ్..ఇప్పుడు నమ్రతతో మహేష్.. డిట్టో దించేశారుగా..!

ఎస్ ప్రెసెంట్ ఇండస్ట్రీలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంత మంది జంటలు ఉన్నా సరే అందరికీ ప్రత్యేక ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు మహేష్ బాబు నమ్రతల జంట . ఈ జంట చాలా అన్యోన్యంగా ఉంటుంది . క్యూట్ రొమాంటిక్ లవ్ బర్డ్స్ అంటూ ఇప్పటికీ ఇండస్ట్రీలో ట్యాగ్ చేయించుకుని ట్రెండ్ అవుతూ ఉంటుంది . రీసెంట్గా ఈ జంట తమ పెళ్ళి రోజును జరుపుకున్నారు . 2005 ఫిబ్రవరి 10న చాలా సింపుల్ గా పెళ్లి చేసుకుంది ఈ జంట .

వంశీ సినిమాలో నటించే టైంలోనే ప్రేమించుకున్న ఈ జంట ఆ తర్వాత గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయనాని కంటిన్యూ చేసి ఫైనల్లీ ఫిబ్రవరి 10, 2005లో పెళ్లి పేరుతో ఒకటైంది . ఈ జంటకి ఇప్పుడు ఇద్దరు పిల్లలు. చక్కగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది ఈ జంట. అయితే ఈ జంటను సుమ – రాజీవ్ కనకాల జంటతో పోలుస్తున్నారు అభిమానులు. రాజీవ్ కనకాల – సుమ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

1999లో ఫిబ్రవరి 10వ తేదీన వీళ్ళ పెళ్లి జరిగింది . వీళ్ల పెళ్లి అయిన 25 ఏళ్ల శుభ సందర్భంగా సుమ ఓ రేర్ స్పెషల్ ఫోటోను షేర్ చేస్తూ రాజీవ్ కు స్పెషల్ గా విష్ చేసింది. ఈ క్రమంలోనే జనాలు ఓ న్యూస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు . ఫిబ్రవరి 10వ తేదీన ఎవరు పెళ్లి చేసుకుంటే వాళ్ళు సుమ – రాజీవ్ , నమ్రత – మహేష్ బాబుల అన్యోన్యంగా ఉంటారు అని .. సరికొత్త న్యూస్ ప్రచారం చేస్తున్నారు. దీంతో ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది..!