అయ్యయ్యో: ఆ బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ చేసుకున్నందుకు మహేష్ ఇప్పటికీ బాధపడుతున్నాడా.. ఆ మూవీ అంత స్పెషలా.. ?!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరచుకున్నాడు. వరుస‌ సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న మహేష్.. వయసు 50లోకి వస్తున్న ఇంకా యంగ్ హీరో లాగే కనిపిస్తూ యువతను ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలో మహేష్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించాడు. అయితే ఎటువంటి స్టార్ సెలబ్రిటీస్ అయినా తమ కెరీర్ లో కొన్ని సినిమాలను ఏవో కారణాలతో రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఆ సినిమాలు తర్వాత మంచి సక్సెస్ సాధిస్తే అయ్యో ఈ సినిమాలో మనం నటించి ఉండాల్సింది అనవసరంగా ఈ సినిమాను మిస్ చేసుకున్నాం అనే ఆలోచన వారిలో వస్తుంది. అలా మహేష్ బాబు కూడా ఓ సందర్భంలో ఫీలయ్యాడట. ఇంతకీ ఆ సినిమా ఏంటి.. మహేష్ బాబు ఎందుకు ఆ సినిమాను రిజెక్ట్ చేశాడో ఒకసారి చూద్దాం.

ఆ మూవీ ఏదో కాదు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన అత్తారింటికి దారేది. ఈ సినిమాను మొదట మహేష్ బాబు తో తీయాలని త్రివిక్రమ్ భావించాడట. ఖలేజా సినిమా షూటింగ్ టైంలో త్రివిక్రమ్ మహేష్‌కు కథను వినిపించగా ఆలోచించి డెసిషన్ తర్వాత చెప్తానని చెప్పిన మహేష్.. ఖలేజా ఫ్లాప్ అవడంతో త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా చేయడానికి ఇష్టపడలేదు. ఇక ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ డైరెక్షన్లో బిజినెస్ మ్యాన్ సినిమాలో నటించాడు. త్రివిక్రమ్‌ను పట్టించుకోకుండా మహేష్ బాబు వరుస సినిమాల్లో నటిస్తూ ఉండడంతో.. చేసేదేమీ లేక త్రివిక్ర‌మ్.. పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది సినిమాను తెరకెక్కించాడు.

ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో మహేష్ బాబు తర్వాత చాలా ఫీల్ అయ్యాడట. త్రివిక్రమ్ చెప్పినప్పుడే ఈ సినిమాకు ఓకే చేసి నటించి ఉంటే బాగుండేది.. అనవసరంగా ఈ సినిమాను అవాయిడ్ చేశాను అంటూ చాలా బాధపడినట్లు తెలుస్తుంది. ఇదే విషయాన్ని మహేష్ బాబు తన సన్నిహితుల దగ్గర ఎన్నోసార్లు ప్ర‌స్తావించాడ‌ట‌. ఏదేమైనా మహేష్ బాబు ఒక సూపర్ హిట్ సినిమాలు వదులుకున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆయన ఫ్యాన్స్ కాస్త నిరాశప‌డుతున్నారు. కాగా ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్లో ఓ సినిమా నటించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా ఇంకా సెట్స్‌ పైకి రాకముందే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.