అనుష్క శెట్టి డైరెక్ట్ చేసిన ఏకైక తెలుగు సినిమా ఇదే.. ఆమె కెరియర్ లోనే మోస్ట్ స్పెషల్..!

సినిమా ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోయిన్స్ ఉండొచ్చు .. చిట్టి పొట్టి మిడ్డీలు వేసుకొని కుర్రాళ్లను టెంప్ట్ చేసే హీరోయిన్స్ కూడా ఉండొచ్చు . కానీ అందరిలోకి ప్రత్యేకంగా నిలుస్తుంది అందాల ముద్దుగుమ్మ అనుష్క శెట్టి. సూపర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఎంతలా అంటే ఆమె సినిమాలు ఫ్లాప్ అవుతున్న సరే మేకర్స్ డైరెక్టర్స్ ఆమెని సినిమాలో హీరోయిన్గా చూస్ చేసుకునేవాళ్లు . ఆఫ్ కోర్స్ అనుష్క కూడా మేకర్ చెప్పిన వాటికి కాదు .. కూడదు అనకుండా తనదైన స్టైల్ లో నటించి మెప్పించేది .

అయితే ఇన్నాళ్ళ తన కెరీర్ లో అనుష్క శెట్టి డైరెక్ట్ చేసిన ఒకే ఒక్క సినిమా భాగమతి అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అనుష్క శెట్టి చాలా రేర్ పీస్. లేడీ ఓరియంటెడ్ ఫీలింస్ లో నటించింది . కానీ అన్నిటిలోకి ప్రత్యేకంగా నిలిచింది భాగమతి . ఈ సినిమాలో ఆమె పెర్ఫార్మెన్స్ టూ గుడ్ . అంతేకాదు ఈ సినిమాలో కొన్ని సీన్స్ ను తానే డైరెక్ట్ చేసుకుందట. డైరెక్టర్ కూడా ఆమె ముచ్చటను కాదనలేక.. ఆమెకే ఓకే చేశారట .

ఈ సినిమాలో ఒక సీన్ లో గోడకు అనుష్క చేతులు పెట్టుకొని సీల కొట్టుకుంటుంది . నిజానికి ఈ సీన్ అనుష్క డిజైన్ చేసుకుందట . ఈ సీన్ సినిమా థియేటర్స్ లో జనాలు చూస్తున్నప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి. అలాంటి మరో టాలెంట్ కూడా అనుష్క శెట్టిలో ఉంది అన్న విషయం ఇప్పుడు బయటపడింది . అంతేకాదు అనుష్క టాలెంట్ కు ఫిదా అయిపోతున్నారు. ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది..!!