ఈ ఆహారాలను వండుకుని తినడం కంటే పచ్చిగా తినడమే బెటరా..?

సాధారణంగా అనేక కూరలను మనం కర్రీస్ గా కానీ ఇతర విధాలుగా తీసుకుంటూ ఉంటాము. బచ్చలకూర మరియు కాలే వంటి ఆకుకూరలలో విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వాటిని పచ్చిగా తినడం వల్ల వాటి పోషకాలు మన శరీరానికి అందుతాయి.

అదేవిధంగా యాపిల్స్ మరియు స్ట్రాబెరీ పండ్లను జ్యూస్ రూపంలో చేసుకుని తాగడం కంటే నార్మల్గా తినడమే బెటర్. జ్యూస్ రూపంలో చేసుకుని తాగడం ద్వారా వాటిలో ఉన్న పీచు పదార్థం పోయి ఎటువంటి పోషకాలు అందవు. వాటిలో ఉన్న ప్రతి పోషకం మనకి అందాలంటే వాటిని పచ్చిగా తినడమే బెటర్.

అదేవిధంగా బాదం మరియు వాల్ నట్స్ ను నానబెట్టి తీసుకోవడం కంటే పచ్చివి తీసుకోవడం మంచిది. వీటిని తరచుగా తీసుకుంటే కొవ్వులు మరియు రొటీన్లు మన శరీరానికి అందుతాయి. కాలీఫ్లవర్, బ్రోకాలీ వంటివి పచ్చిగానే తీసుకోవాలి. అప్పుడే వాటిలో ఉండే పోషకాలు మన శరీరానికి పుష్కలంగా ఉంటాయి. అందువల్ల పైన చెప్పిన వాటిని పచ్చిగా తీసుకోవడానికి ట్రై చేయండి.