ఆరోగ్యకరమైన నిద్ర కోసం ఈ సింపుల్ టిప్స్ ని ఫాలో అవ్వండి..!

సాధారణంగా ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి కారణంగా అనేక అనారోగ్య సమస్యలతో పాటు నిద్రలేమి సమస్య కూడా ఏర్పడుతుంది. ఆలస్యంగా నిద్రపోవడం వల్ల అధిక బరువు కూడా పెరుగుతారని నిపుణులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా అనేక జబ్బులు సైతం ఏర్పడతాయట.

రాత్రులు ఆలస్యంగా నిద్రపోవడం వల్ల మానసిక ఆరోగ్యం పై చెడు ప్రభావం పడుతుంది. అలాగే ఆందోళన మరియు డిప్రెషన్ వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. మీరు మీ పనులను కూడా సరిగ్గా చేయలేరు. ఆరోగ్య నిపుణులు ప్రకారం నిద్రపోవడం వల్ల హార్మోన్స్ ఉత్పత్తి సరిగ్గా జరిగి ఎటువంటి అనారోగ్య సమస్యలు దరి చేరవు. ఇక కొన్ని టిప్స్ ని పాటించడం ద్వారా ఆరోగ్యమైన నిద్రని మీ సొంతం చేసుకోవచ్చు.

ప్రతిరోజు 8 గంటలకు పడుకుని ఉదయం ఆరు గంటలకి లేదా ఐదు గంటలకి లెగడం అలవాటు చేసుకుంటే మీ శరీరం దృఢంగా మరియు యాక్టివ్ గా ఉంటుంది. అదేవిధంగా మన శరీరానికి మరియు నిద్రకి కావాల్సిన ముఖ్యమైన పండ్లను మరియు డ్రై ఫ్రూట్స్ ను అందించడం ద్వారా ఆరోగ్యమైన నిద్ర మన సొంతం అవుతుంది. అందువల్ల ప్రతిరోజు ఫ్రూట్స్ ని తీసుకుంటూ ఒకే టైం కి నిద్రించండి. 10 కన్నా పైన నిదురిస్తే అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కనుక 10 కన్నా ముందే నిద్రించండి.