ఆ స్టార్ యాంకర్ పై కన్నేసిన విశ్వక్ సేన్.. ఆ విషయంలో హీరోయిన్స్ ని కూడా మించి పోతున్నారంటూ..

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్‌సేన్ అతి తక్కువ సమయంలోనే హీరోగా తనకంటూ ఒక మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. నటించినవి చాలా తక్కువ సినిమాల్లో ఆయినా.. క్రేజీ హీరోగా పాపులర్ అయ్యాడు. ఎక్కువగా కాంట్రవర్షియల్ కామెంట్స్ తో వార్తల్లో నిలిచే ఈ యంగ్ హీరో.. ప్రస్తుతం గ్యాంగ్స్‌ ఆఫ్ గోదావరి, గామీ లాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా విశ్వక్య ఇంటర్వ్యూలో సందడి చేశాడు.

ఆయన మాట్లాడుతూ ఇంటర్వ్యూవ‌ర్ అడిగే ఎన్నో ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. ఇందులో భాగంగా యాంకర్ పై విశ్వక్సేన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఆ వీడియోలో విశ్వక్ యాంకర్ స్రవంతిని పొగుడుతూ కామెంట్స్ చేశాడు. యాంకర్ స్రవంతి మాట్లాడుతూ చాలా బాగుంది అంటూ ఏదో చెప్పబోతుంటే.. ఇంత‌లో విశ్వక్ కలగ చేసుకుని మీరు ఈ మధ్య హీరోయిన్స్ కంటే మంచి చీరలు కడుతున్నారు.

 

చాలా అందంగా కనిపిస్తున్నారంటూ చెప్పుకొచ్చాడు. దానికి ఆమె థాంక్స్ చెబుతూ నవ్వేసింది. ఇక ఈ వీడియో చూసిన వారంతా తెగ కామెంట్లు చేస్తున్నారు. గురుడు మంచి రొమాంటిక్ అంటూ.. ఆమె ఏదో ప్రశ్న అడగుతుంటే పులిహార కలిపి ఆమెను భలే ఆపేసావు భయ్యా అంటూ.. నీ కన్ను ఆమెపై పడిందా విశ్వక్ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Telugu Edition (@telugu_edition)