గతాన్ని త‌లుచుకొన్ని స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న గీతామాధురి భర్త.. న‌ర‌కం చూశానంటూ..

టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్‌ గీతామాధురి – నందుకు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. గీతమాధురి సింగర్ గా తన సత్తా చాటితే నందు యాక్టర్ గా ఎంతో మంది ప్రేక్షకులను మెప్పించాడు. టాలీవుడ్ లో టాప్ సింగర్ గా రాణిస్తున్న గీత త్వరలోనే రెండోసారి పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ నెలలోనే ఆమె డెలివరీ డేట్ కూడా ఫిక్స్ అయిన్న‌ట్లు గీత మాధురి స్వయంగా వివరించింది. ఇంతటి సంతోష సమయంలో నందు తన గతాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

బుల్లితెరపై జరిగిన టీవీ ప్రోగ్రాంలో నందుకు హైపర్ ఆది నుంచి ఎదురైన ప్రశ్నకు సమాధానం చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. గీతామాధురిని ఉద్దేశించి మీ ఇద్దరి మధ్య జరిగిన ఎమోషనల్ మూమెంట్స్ చెప్పండి అని ఆది అడగగా.. ఆ సమయంలో నందు కన్నీరు పెట్టుకుంటూ ఇలా వివరించాడు. గతంలో నా మీద ఓ రూమర్ వచ్చింది. నాకు దాంతో ఎలాంటి సంబంధం లేకపోయినా పదే పదే నన్ను హైలెట్ చేస్తూ న్యూస్ లో తెగ హంగామా చేశారు. యూట్యూబ్ ఛానల్స్ కూడా నెగిటివ్ గా ప్రచురించాయి.

ఏకంగా 12 రోజులపాటు నన్ను వేధించారు. దాంతో నాకు ఎలాంటి సంబంధం లేదని తేలాకా సింపుల్గా ఒక్క స్క్రోలింగ్ వేశారు. దానివల్ల నాతోపాటు గీత కూడా చాలా బాధపడింది అంటూ నందు స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్నాడు. తాజాగా ఆ వీడియో వైర‌ల్ కావ‌డంతో సుమారు 5 ఏళ్ల క్రితం టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు కొనసాగించిన విషయం తెలిసిందే. అందులో నందు పాత్ర ఉన్నట్టు ఈడి అనుమానించి ఆయనను విచారించింది. ఆ టైంలో నందుని కేవలం అనుమానితుడుగానే ఈడీ విచారించి ఆయనకు క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. దీంతో నందు కన్నీళ్లు పెట్టుకున్నది ఈ విషయంపైనే అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు.