గోవా అందాలతో రకుల్ ప్రీత్ – జాకీ భగ్నని పెళ్లి కార్డ్.. వారెవా లుక్ అదిరిందిగా..

ఒకపటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ లాంటి టాలీవుడ్ అగ్ర హీరోలు అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. కొంతకాలంగా టాలీవుడ్ లో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్‌కు చెక్కేసింది. అయితే అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించిన ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్ లో కూడా అవకాశాలు కలిసి రాలేదు. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ వెబ్‌సిరీస్‌లపై కాన్సెంట్రేట్ చేస్తూ ఇండస్ట్రీలో రాణిస్తుంది. కాగా ప్రస్తుతం ఈ స్టార్‌ ట్యూటీ పెళ్లి పనుల్లో బిజీ బిజీగా గడుపుతుంది.

బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీ భగ్నాన్ని ప్రేమించిన ఈ ముద్దుగుమ్మ చాలా కాలంగా ఇతనితో ప్రేమలో ఉంది. వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా తమ రిలేషన్ షిప్‌ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే ఎట్టకేలకు వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారు. మరికొన్ని రోజుల్లో ఈ జంట వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఫిబ్రవరి 21న రకుల్ జాకీ బాగ్నాన్ని వివాహం గోవాలో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ క్రమంలో తాజాగా వీరి పెళ్లి శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వీరు పెళ్లి గోవాలో జరగనున్న సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టుగా శుభలేఖల్లో కూడా గోవా బీచ్ అందాలు.. చుట్టుకొబ్బరి చెట్లు.. మధ్యలో మండపం కనిపించేలా పెళ్లి కార్డును బ్యూటిఫుల్ గా ప్రింట్ చేపించారు. ఇక పెళ్ళికార్డ్‌పై రకుల్ భ‌గ్నాని పేర్లతో పాటు హ‌మ్ దోనో భగ్నాన్ని అంటూ రాసి ఉంది. ఇక ఈ పెళ్లి మూడు రోజులు ఘనంగా జరగబోతుంది. మూడు రోజులకు ముగ్గురు డిజైనర్ల‌ను ఈ పెళ్లి కోసం సెలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. సవ్యసాచి, తరుణ్ తహిల్యాన్ని, మనీష్ మల్హోత్ర ఇలా ఈ ముగ్గురు డిజైనర్లు రెడీ చేసిన బట్టలనే రకుల్ భాగ్నాని పెళ్లికి ధరించనున్నారు. ఇక పెళ్లి తర్వాత కూడా రకుల్ ఎప్పటిలాగానే సినిమాల్లో నటిస్తోంది.