కొంప ముంచేసిన ఛార్మి..”శ్రీ అంజనేయం కంటే హనుమాన్ 1000రెట్లు బెటర్”..కృష్ణ వంశీ షాకింగ్ రిప్లై..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక జనాలు ఉన్న విషయాన్ని ఉన్నట్టే మాట్లాడేస్తున్నారు. మరికొందరు టాప్ సెలబ్రిటీస్ ని టార్గెట్గా చేస్తూ పరోక్షకంగా కౌంటర్స్ వేస్తున్నారు . రీసెంట్గా సోషల్ మీడియాలో హనుమాన్ సినిమా సృష్టిస్తున్న మానియా అంతా అంతా కాదు . హనుమాన్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోగా తేజ సజ్జా నటించారు . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇండస్ట్రీ రికార్డులను బ్లాస్ట్ చేస్తూ సంచలన రికార్డును నెలకొల్పుతుంది . ఈ క్రమంలోనే కొందరు నెటిజన్స్ గతంలో తెరకెక్కిన సినిమాలకు హనుమాన్ సినిమాలకు కంపారిజన్ చేస్తున్నారు .

ఈ క్రమంలోనే నితిన్ నటించిన శ్రీ ఆంజనేయం సినిమాను ట్రోల్ చేస్తున్నారు . నితిన్ హీరోగా ఛార్మి హీరోయిన్ గా శ్రీ ఆంజనేయం అనే సినిమా వచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది . భారీ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన ఈ సినిమాను జనాలు ఆదరించలేకపోయారు. అయితే అప్పట్లో ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం ఛార్మ్ చేసిన ఓవర్ యాక్టింగ్ అంటూ వార్తలు వినిపించాయి . చాలా సైలెంట్ గా ఉండే నితిన్ క్యారెక్టర్ కు అంత ఓవర్ ఆక్టింగ్ చేసే ఛార్మిని పెట్టడం ఎబ్బెట్టుగా ఉంది అంటూ జనాలు మండిపడ్డారు.

అయితే రీసెంట్ గా ఒక నెటిజన్ డైరెక్ట్ గా శ్రీ ఆంజనేయం సినిమా కంటే హనుమాన్ సినిమా వెయ్యి రెట్లు బెటర్ అన్న రేంజ్ లో కామెంట్స్ చేశారు . దీనిపై డైరెక్టర్ కృష్ణవంశీ కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన పాజిటివ్ గానే స్పందించారు . “హనుమాన్ సినిమా బాగుంది .. శ్రీ ఆంజనేయం సినిమా రీచబుల్ తక్కువగా ఉంది .. అది నేను ఒప్పుకుంటాను .. కొన్ని కొన్ని మైనస్ పాయింట్ లు ఉన్నాయి. అందువల్ల జనాలు ఆదరించలేకపోయి ఉండొచ్చు “అంటూ తనలోని తప్పును ఓపెన్ గా బయటపెట్టేసాడు. దీంతో కృష్ణవంశీ నిజాయితీ అభిమానులకు కొత్త రకమైన ఫీలింగ్ కలుగజేస్తుంది . ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది..!!