రెండో పెళ్లి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాగచైతన్య.. వధువు ఎవరంటే..?

అక్కినేని నట వారసుడు నాగచైతన్య ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదట్లో మంచి సినిమాలతో సక్సెస్ సాధించినా.. ప్రస్తుతం వరుస ప్లాపులను ఎదుర్కొంటూ సినిమాలపరంగా కాస్త వెనకబడ్డాడు. అయితే ఇటీవల డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టి దూత వెబ్ సిరీస్ తో భారీ సక్సెస్ అందుకున్నాడు. కాగా గతంలో స్టార్ బ్యూటీ సమంతతో నాగచైతన్యకు వివాహమై.. వాళ్లు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇద్దరు ఎవరి కెరీర్ వాళ్ళు చూసుకుంటూ లైఫ్ లో బిజీగా గడుపుతున్నారు. ఇక‌ ఇప్పటికే సమంత రెండో వివాహానికి సిద్ధమైందంటూ పలు వార్తలు వైరల్ అయ్యాయి.

తాజాగా అక్కినేని నాగచైతన్య కూడా త్వరలోనే రెండో పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొదట ప్రేమించి వివాహం చేసుకున్న ఆ పెళ్లి నిలబడకపోవడంతో.. ఈసారి పెద్దలు కుదిరిచిన పెళ్లి చేసుకోవడానికి చైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. తన రెండో పెళ్లి బాధ్యతను పూర్తిగా తండ్రి నాగార్జునకే అప్పగించినట్లు తెలుస్తోంది. నాగార్జున కూడా కొడుకు కోసం ఎంతో ఆలోచించి మరి దగ్గర బంధువుల అమ్మాయిని ఒక అమ్మాయిని సెలెక్ట్ చేశాడట. ఇప్పటికే ఇద్దరు కుటుంబాల మధ్య మాటలు పూర్తయ్యాయని.. త్వరలోనే ముహూర్తాలు కూడా ఫిక్స్ చేసుకోబోతున్నట్లు సమాచారం అందుతుంది.

అయితే సమంతతో విడాకుల తర్వాత మరో బ్యూటీ శోభిత ధూళిపాళ్లతో నాగచైతన్య ప్రేమలో ఉన్నట్టు.. వారి ఇద్దరి త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపించాయి. వాటిలో ఎలాంటి నిజం లేదని క్లారిటీ వచ్చేసింది. ఈ నేపథ్యంలో తన బంధువుల అమ్మాయితో చైతన్య రెండో పెళ్లి అని మరోసారి వార్తలు వినిపించడంతో.. ఈ వార్తలు నెట్టింట‌ వైరల్ అవుతున్నాయి. దీంతో కొంతమంది అక్కినేని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తుంటే.. మరి కొంతమంది మాత్రం ఎవరో పని పాట లేని వాళ్ళు ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కొట్టి పడేస్తున్నారు. అయితే ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాలంటే అక్కినేని ఫ్యామిలీ రియాక్ట్ అవ్వాల్సిందే.