నంది అవార్డు వచ్చిన ఇప్పటివరకు ఇవ్వలేదంటూ సంచలన కామెంట్స్ చేసిన నటి.. పోస్ట్ వైరల్..

బుల్లితెర నటి రోహిణి కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ ద్వారా సిల్వర్ స్క్రీన్ కు పరిచయమైంది. మొదటి సీరియల్ అయినా తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది రోహిణి. తర్వాత కామెడి యాక్ట‌ర్‌గా ప‌లు సీరియ‌ల్స్‌లో నటించిన ఈమె.. ఆ తర్వాత జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి కామెడీ షో లతో పాపులారిటీ దక్కించుకుంది. తన కామిడీ టైమింగ్ తో జనాలను నవ్విస్తూ ఉండే ఈ బ్యూటీ పలు సినిమాల్లో కూడా అవకాశాలను అందుకుంటు నటిస్తోంది.

ఇక ఇటీవల ఆమె కాలుకు సర్జరీ చేయించుకుని కొంతకాలం పాటు నట‌న‌కు దూరమైంది. ఆ టైంలో మళ్లీ రోహిణి స్క్రీన్ పై కనిపించదు అంటూ.. నటనకు పూర్తిగా స్వస్తి చెప్పేస్తుందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఆమె వీల్ చైర్ లో కూర్చుని కూడా పలు షోల‌లో సందడి చేసింది. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్న రోహిణి టీవీ షో లతో ఫుల్ బిజీగా గడుపుతుంది. కాగా 2014 సంవత్సరం బుల్లితెర సీరియల్స్ నంది అవార్డుల లిస్టు ప్రకటించగా.. వాటిలో కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ లో రోహిణి పాత్రకు బెస్ట్ టీవీ కమెడియన్గా నంది అవార్డ్‌ అనౌన్స్ చేశారు.

తనకి నంది అవార్డుతో పాటు పదివేల రూపాయలు కూడా అందజేస్తామంటూ ఆ లెటర్ పంపినట్లు సమాచారం. అయితే రోహిణి ఆ లెటర్ ని తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంది. అలాగే నా ఫస్ట్ సీరియల్ కి నంది అవార్డు వచ్చింది. ఇప్పటివరకు దానిని నాకు అందజేయలేదు అంటూ రాసుకొచ్చింది. నా కెరీర్‌లో ఆ సీరియల్ ఓ మంచి జ్ఞాపకం. ఇక గతంలో నేను సాధించిన ఈ విజయాన్ని జస్ట్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా అంటూ వివరించింది. ప్రస్తుతం రోహిణి చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. రోహిణికి నంది అవార్డు వచ్చిందా.. అయినా ఇప్పటివరకు ఇవ్వకపోవడం ఏంటి అంటూ అంత ఆశ్చర్యపోతున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Rohini (@actressrohini)