“నా లైఫ్ లో మళ్ళీ ఆనందం నీ వల్లే”.. మెగా మాజీ అల్లుడు ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..!!

సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఊహించినవి జరుగుతూ ఉంటూ ఉంటాయి అని అందరూ అంటుంటారు. బహుశా కళ్యాణ్ దేవ్ విషయంలో అది ఆప్ట్ గా నిజం అయింది . చిరంజీవి చిన్న కూతురు శ్రీజ రెండో భర్తగా కళ్యాణ్ దేవ్ బాగా సుపరిచితుడే . సోషల్ మీడియాలో కూడా బాగా పాపులారిటీ దక్కించుకున్నాడు. పలు సినిమాల్లో నటించినా పెద్దగా క్రేజ్ దక్కించుకోలేకపోయాడు. అయితే కళ్యాణ్ దేవ్ కొన్ని మనస్పర్ధలు కారణంగా శ్రీజ తో విడాకులు తీసుకున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది . కానీ దీనిపై ఇప్పటివరకు అఫీషియల్ గా అటు శ్రీజ ఇటు కళ్యాణ్ దేవ్ స్పందించకపోవడం గమనార్హం.

కాగా కళ్యాణ్ దేవ్ శ్రీజ కలిసి ఉన్నప్పుడు వాళ్లకు ఒక పాప జన్మించింది . అయితే ఇప్పుడు ఆ పాప కొన్ని రోజులు శ్రీజ దగ్గర కొన్ని రోజులు కళ్యాణ్ దేవ్ దగ్గర ఉంటుంది . రీసెంట్గా ఆ పాప కళ్యాణ్ దేవ్ వద్దకు వెళ్ళింది . దీంతో కూతురు రాకతో సంతోషంతో నిండిపోయిన మనసుతో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు కళ్యాణ్ . తన కూతురితో గడిపిన క్షణాలను అభిమానులతో పంచుకున్నాడు. చాలా రోజుల తర్వాత కళ్యాణ్ మరోసారి తన కూతురు నవిష్క పై ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేయడం అభిమానులకు హ్యాపీనెస్ కలగజేసింది.

తన పుట్టినరోజు వేడుకలకు కూతురు రావడం పట్ల చాలా స్పెషల్ అంటూ చెప్పుకొచ్చాడు కళ్యాణ్ దేవ్ . “నీ రాకతో నా పుట్టినరోజు చాలా ప్రత్యేకంగా మారింది.. నీతో సమయం గడపడం చాలా ఆనందకరంగా ఉంది ..లవ్ యు ది మూన్ అండ్ బ్యాక్” అంటూ క్యాప్షన్ జత చేశాడు . ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతుంది. కళ్యాణ్ దేవ్ కి కూతురు అంటే ఎంత ప్రేమో అంటూ జనాలు ఆయన పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు..!

 

 

View this post on Instagram

 

A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev)