“ఆ పుణ్యం వల్లే బన్నీ ఇప్పుడు ఈస్ధాయి కి ఎదిగాడు”.. అల్లు అర్జున్ బావ మరిది సెన్సేషనల్ కామెంట్స్..!?

సినిమా ఇండస్ట్రీలో నాన్న పేర్లు తాతలు పేర్లు చెప్పుకొని ఇండస్ట్రీలో ఇండస్ట్రీలోకి రావడం చాలా చాలా కామన్ గా చూస్తూ ఉంటాం. ఇండస్ట్రీలో చాలామంది స్టార్ సెలబ్రిటీస్ కూడా అలా వచ్చినవారే . అయితే నాన్న పేరు తాతల పేర్లు ట్యాగ్ చేయించుకున్నంత మాత్రాన స్టార్ హీరో అయిపోవాలి అన్న రూల్ రెగ్యులేషన్స్ లేవు. ఎందుకంటే ఇండస్ట్రీలోకి వచ్చినా ప్రతి ఒక్కరూ టాలెంట్ ని ఉపయోగించాలి ..కాస్తో కూస్తో తమలో టాలెంట్ లేకపోతే జనాలు ఆదరించరు. ఈ విషయం చాలామంది .. మెగా హీరోల మ్యాటర్లో నిజమైంది . మెగా టాక్ ఉపయోగించుకొని.. ఇండస్ట్రీలోకి వచ్చిన సరే కొంతమంది సక్సెస్ కాలేకపోయారు .

కాగా రీసెంట్గా అల్లు అర్జున్ బావమరిది విరాన్ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెడుతున్నాడు .. ముఖ్య గమనిక అనే సినిమా ద్వారా తెలుగు చిత్ర సీమకు పరిచయం అవుతున్నాడు . ఈ క్రమంలోనే ఆయన సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అల్లు అర్జున్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి . అల్లు అర్జున్ గురించి చాలా గొప్పగా చెప్పారు . అల్లు అర్జున్ లోని మంచితనాన్ని మరోసారి అందరికీ తెలియజేశారు . అంతేకాదు ఆయన పరోక్షకంగా కొన్ని మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట ట్రోలింగ్ కి గురవుతున్నాయి .

పరోక్షకంగా అల్లు అర్జున్ కథలను నేను వినేవాడినీ అనే విధంగా ఆయన మాట్లాడడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే పాజిటివిటీ ఉంటుందో అక్కడే నెగటివిటీ కూడా ఉంటుంది. ఎక్కడ పొగిడే వాళ్ళు ఉంటారు అక్కడ తిట్టేవాళ్ళు కూడా ఉంటారు. అయితే విరాన్ తెలిసి తెలియక చేసిన పరోక్ష కామెంట్స్ పై కొందరు ఏకిపారేస్తున్నారు. ” ఓకే ఇప్పుడేమంటావ్.. నీ పుణ్యం వల్లే బన్నీ ఈ స్థాయిలో ఉన్నాడంటావా ..?అంతేలే అంటూ ఎవరి డప్పు వాళ్ళు కొట్టుకోవడం సహజమే అని “దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు . పాపం ఇండస్ట్రీలోకి రాకముందే ట్రోలింగ్ తో ఆడేసుకుంటున్నారు బన్నీ బావమరిది ని జనాలు..!!