“ఆడదానికి ఆడదే శత్రువు అంటే ఇదే నా..?”.. అర్చనని నమ్మించి ముంచేసిన స్టార్ హీరోయిన్..!

సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం . ఇది ఓ మాయా లోకం . ఊసరవెల్లి లా రంగుల మార్చినంత ఈజీగా సినిమా ఇండస్ట్రీలో రంగులు మార్చే జనాలు ఉంటారు అంటూ చాలామంది నటీనటులు చెప్పుకొస్తూ ఉంటారు. మరి కొంతమంది అలాంటి మాయలకు బలైపోయారు అని చెప్పడంలో సందేహం లేదు . అలా బలైపోయిన వాళ్ళు కూడా ఓపెన్ గా పలు ఇంటర్వ్యూలలో మేము ఫలానా వాళ్ల చేత మోసపోయాము అంటూ చెప్పుకొస్తూ ఉంటారు . కాగా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ గా మారిన హీరోయిన్ అర్చనా కూడా హీరోయిన్గా తన కెరియర్ను నిలబెట్టుకోలేకపోయింది . అఫ్ కోర్స్ హీరోయిన్ కి మించిన మెటీరియల్ అర్చన సొంతం.. చక్కగా ఉంటుంది అందంగా మాట్లాడుతుంది ..తెలుగు అవలీలగా పలికేస్తుంది.. డాన్స్ – నటన – ఎక్స్ప్రెషన్స్ .. ఒకటా రెండా ఒక హీరోయిన్ కి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ కూడా అర్చనాల్లో ఉన్నాయి .

చూడచక్కని కుందనపు బొమ్మలా ఉంటుంది .. మేకప్ వేయకపోయినా అట్రాక్ట్ చేస్తుంది . మరి అలాంటి అర్చన ఇండస్ట్రీలో ఎందుకు హీరోయిన్గా సెటిల్ కాలేక పోయింది ..? అనేది అందరికీ ప్రశ్నార్ధకంగానే ఉంది . అయితే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హీరోయిన్ అర్చన తన కెరియర్ డౌన్ అవ్వడానికి కారణం ఓ హీరోయిన్ అంటూ పరోక్షకంగా బయటపెట్టేసింది. ఆమె మరెవరో కాదు త్రిష. పరోక్షకంగా అర్చన కెరియర్ డౌన్ అవ్వడానికి హీరోయిన్ త్రిషనే కారణం అంటూ పలువురు జనాలు కూడా అప్పట్లో మాట్లాడుకోవడం గమనార్హం .

“నువ్వు వస్తానంటే నేనొద్దంటానా ” సినిమాలో అర్చన అది సెకండ్ హీరోయిన్ పాత్ర .. కానీ ఫైనల్లీ ఆమెది ఫ్రెండ్ పాత్రగా మలిచేశారు. ఆ సినిమాలో త్రిష కన్నా హీరోయిన్ చాలా చక్కగా నటించింది అంటూ చాలామంది జనాలు కామెంట్స్ చేశారు . అయితే ఈ సినిమాలో కొన్ని కొన్ని మంచి సీన్స్ అర్చనవి లేపేసారట.. ఆ కారణంగానే అర్చనది సపోర్టింగ్ పాత్ర అయిపోయింది . దీంతో ఈ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా అర్చనాలను సపోర్టింగ్ రోల్స్ కోసమే అప్రోచ్ అయ్యే వారట. హీరోయిన్గా ఆమెకు అవకాశాలే వచ్చేటివి కావట. వచ్చిన అరా కొరా కూడా ఆమెకు హిట్ ఇవ్వలేకపోయాయి . ఇలా పరోక్షకంగా అర్చన కెరియర్ నాశనం అవ్వడానికి కారణమైంది త్రిష అంటూ పలువురు అర్చన అభిమానులు అప్పట్లో మాట్లాడుకునే వాళ్ళు . అంతేకాదు ఆడదానికి ఆడదే శత్రువు అంటే ఇదేనేమో అంటూ కూడా పలు సామెతలను అప్పట్లో ట్రెండ్ చేశారు..!!