హీరోయిన్ రంభ కూతురని చూశారా.. స్టార్ హీరోయిన్లు కూడా ఈమె అందం ముందు బలాదూర్..

ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా భారీ పాపులారిటీ దక్కించుకున్న హీరోయిన్లలో రంభ ఒకటి. ఆ ఒక్కటి అడక్కు సినిమాతో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకుంది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమెకు వరుస అవకాశాలు వ‌చ్చాయి. అతి తక్కువ సమయంలోనే స్టార్ బ్యూటీగా మారిన ఈమె టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సినిమాల్లో న‌టించింది. సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ ఇలా అప్పటి స్టార్ హీరోల అందరి సరసన నటించి ప్రశంసలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. 90లో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ భారీ పాపులారిటీ ద‌క్కించుకుంది.

అన్ని భాషల్లో కలిపి మొత్తానికి వందకు పైగా సినిమాల్లో నటించిన ఈమె హీరోయిన్ గానే కాక పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో కూడా ఆక‌ట్టుకుంది. ఇక చివరిగా అల్లు అర్జున్ నటించిన దేశముదురు మూవీ స్పెషల్ సాంగ్లో క‌నిపించింది. ఆ తర్వాత కెనడాకు చెందిన బిజినెస్ మాన్ ఇంద్ర కుమార్ ను పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. ప్రస్తుతం కెనడాలో ఉంటున్నారు. ఇక సినిమాలకు దూరంగా ఉన్నా రంభ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. ఫ్యామిలీ ఫొటోస్, తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటుంది.

అలాగే ఆమె నటించిన సినిమాలు.. ఇండస్ట్రీలో ఈమెకు ఉన్న స్నేహితుల గురించి ఆసక్తికర విషయాలను పోస్ట్ రూపంలో షేర్ చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా తన పెద్ద కూతురుతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట‌ తెగ వైరల్ అవుతున్నాయి. మై ఏంజెల్ అంటూ ఆ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది రంభ. అయితే రంభ‌ కూతురిని చూసిన వాళఅంతా ఆశ్చర్యపోతున్నారు. అందంలో తన తల్లిని మించిపోయిందిగా అంటూ.. అచ్చుగుద్దినట్లు రంభలాగే ఉందే.. జూనియర్ రంభ, క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ అంటూ.. ఈమె ముందు స్టార్ హీరోయిన్లు కూడా బలాదూర్ అనేంత అందంగా ఉందే అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు.