షాకింగ్ : విజయ్ దేవరకొండ సినిమాలు నాకు అసలు నచ్చవంటూ నిర్మోహమాటంగా చెప్పేసిన పీవీ సింధు.. కామెంట్స్ వైరల్..

స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధుకు తెలుగు జనాల్లో ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన ఆటతో ఇండియాకు ఎన్నో బహుమతులు, పద‌కాలను తెచ్చిపెట్టిన పీవీ సింధు.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సందడి చేసింది. ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు నచ్చిన విషయాలను ప్రేక్షకులతో షేర్ చేసుకుంది. ఇందులో భాగంగా తనకు నచ్చిన హీరోల గురించి చెప్పుకొచ్చింది. ప్రభాస్ అంటే ఆమెకు ఇష్టమని.. ఆయన సినిమాలన్నీ చూస్తానని వివరించింది.

కానీ ప్రభాస్ అంటే ఇష్టం ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఆయన కలవలేదని.. ఆ ఛాన్స్ నాకు రాలేదంటూ వివరించింది. తనకు రామ్ చరణ్ అన్నా కూడా చాలా ఇష్టం అంటూ చెప్పిన ఆమె చరణ్ ని కలిశానని చెప్పుకొచ్చింది. యంగ్ హీరోల్లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ మూవీస్ చూస్తానని.. అయితే వాటిలో నచ్చని సినిమాలు కూడా ఉన్నాయి అంటూ వివరించింది పీవీ సింధు. అయితే రౌడీ హీరో సినిమాలలో ఆమెకు నచ్చని సినిమాలంటేనే అంశంపై మాత్రం సమాధానం చెప్పలేదు.

ఇక మీరు సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉందా అని ఏదురైన ప్రశ్నకు.. నాకు సినిమాల్లో నటించే ఆలోచన లేదని.. పూర్తిగా నా ఆట మీదే ఫోకస్ ఉందంటూ చెప్పుకొచ్చింది. తన బయోపిక్ చేస్తే అందులో ఎవరు సెట్ అవుతారు అనే ప్రశ్నకు దీపిక పదుకొనే అయితే పర్ఫెక్ట్ గా ఉంటుందని పీవీ సింధు వివరించింది. మొత్తానికి విజయ్ దేవరకొండ సినిమాలు నచ్చవని సింధు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ సినిమాలు ఏమై ఉంటాయి అనే అంశంపై ఆరా తీయడం మొదలుపెట్టారు నెటిజన్లు.