కొణిదెల ఫ్యామిలీలోకి మరో మెంబర్ రాబోతున్నాడా..? మెగా ఫాన్స్ కు వెరీ వెరీ స్వీట్ న్యూస్.. !

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . మెగా కోడలు లావణ్య త్రిపాఠి అభిమానులకు గుడ్ న్యూస్ వినిపించబోతుందా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది. అయితే అది రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో.. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న లావణ్య త్రిపాఠి – మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. నవంబర్ 1 న వీళ్ల పెళ్లి గ్రాండ్ గా అంగరంగ వైభవంగా ఇటలీలో జరిగింది .

ఆ తర్వాత జరిగిన ప్రతి ఫంక్షన్ తాలూకా పిక్చర్స్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నారు లావణ్య – వరుణ్ . రీసెంట్గా పెళ్లి తర్వాత లావణ్య ఫస్ట్ వెబ్ సిరీస్ “మిస్ పర్ఫెక్ట్” లో కూడా నటించింది. ఈ సిరీస్ సూపర్ డూపర్ హిట్ అయింది . అయితే ఇప్పుడు లావణ్య త్రిపాఠి మరో సినిమాకి కమిట్ అయినట్లు తెలుస్తుంది . ఈ సినిమాలో ఆమె తల్లి పాత్రలో కనిపించబోతుందట . ఇది పూర్తిగా మదర్ సెంటిమెంట్ ఆధారంగా తెరకెక్కబోతుందట.

ఈ సినిమాలో హీరో చిన్నప్పటి క్యారెక్టర్ కోసం లావణ్య త్రిపాఠిని తల్లిగా చూస్ చేసుకున్నారట మేకర్స్. ఫ్యామిలీ ఎమోషన్ సినిమా కావడంతో లావణ్య నో చెప్పలేక పోయిందట. అంతేకాదు ఈ సినిమాకి లావణ్య పాత్ర కీలకంగా మారబోతుందట . అయితే లావణ్య తల్లి కాబోతుంది అని తెలుసుకున్న జనాలు రియల్ లైఫ్ లో అంటూ పొరపాటున కంగ్రాట్స్ చెప్పేస్తున్నారు . అంతేకాదు ఉపాసనాల ఎక్కువ టైం తీసుకోకుండా..? నువ్వు త్వరగా గుడ్ న్యూస్ చెప్పేసేయ్ లావణ్య అంటూ అభిమానులు లావణ్య కు స్పెషల్ సజెషన్స్ ఇస్తున్నారు. చూద్దాం రీల్ లైఫ్ లో విన్న ఆ గుడ్ న్యూస్ రియల్ లైఫ్ లో ఎప్పుడు వింటామో..?