టాలెంటెడ్ డైరెక్టర్ మహి వి రాఘవ దర్శకత్వంలో తెర కెక్కిన సినిమా యాత్ర 2. నేడు థియేటర్స్ లో గ్రాండ్గా ఈ సినిమా రిలీజ్ అయింది . ఈ సినిమా అభిమానులను ఆకట్టుకుంటుంది . ఇప్పటికే ప్రీమియర్స్ కంప్లీట్ అవ్వగా సినిమా చూసి వచ్చిన జనాలు సినిమా పై తమ ఒపీనియన్ ను ట్విట్టర్ వేదికగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నారు . 2019లో వచ్చిన యాత్ర సినిమా ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయిందో మనకు తెలిసిందే. ఆ సినిమా దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారికి బయోపిక్గా తెరకెక్కింది . అయితే రీసెంట్గా వచ్చిన యాత్ర 2 సినిమా ఆయన కొడుకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్ గా తెరకెక్కింది . కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది ఇక ఇక ఆ పార్టీ అడ్రస్ క్లోజ్ అనుకుంటున్న సమయంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రజలకు సేవ చేయాలి అని ప్రజల బాగోగులు తెలుసుకోవడానికి స్వయాన పాదయాత్ర చేసి కష్టపడి మళ్లీ కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొచ్చారు .
ఆయన పెట్టిన పథకాలు .. అమలు చేసిన సంక్షేమ పనులు ఎలా ఇప్పటికీ జనాలకు లబ్ధి చేకూరుస్తున్నాయో మనకు తెలిసిందే . జనాల కోసం ఏమైనా చేస్తాడు వైయస్సార్ ఎంతకైనా తెగిస్తాడు అని యాత్ర మూవీలో చూపించారు డైరెక్టర్ . రీసెంట్గా యాత్ర 2 సినిమా దానికి కొనసాగింపుగా రిలీజ్ అయింది . ఈ సినిమాలో దర్శకుడు మహీవి రాఘవ తన డైరెక్షన్ ని పూర్తిగా వినియోగించుకున్నాడు . మరీ ముఖ్యంగా వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి ఎంతలా జీవించేసాడో అంతకు డబల్ రేంజ్ లో వైయస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో జీవ జీవించేసాడు . కడప ఎంపీ అభ్యర్థిగా జగన్ ని వైయస్సార్ ప్రజలకు పరిచయం చేయడంతో ఈ సినిమా మొదలవుతుంది .
ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి రాజకీయాలలో ఎలా నిలతక్కుతున్నాడు..? ఎలా తొక్కేయాలని చూసారు ..? అన్న విషయాలను క్లియర్ గా చూపించాడు డైరెక్టర్. అంతేకాదు ఇలాంటి సినిమాలలో ప్రత్యర్థులను కచ్చితంగా టార్గెట్ చేస్తూ ఉంటారు కొంతమంది డైరెక్టర్లు .. అయితే ఈ డైరెక్టర్ మాత్రం అలా ఏమీ చేయలేదు .. జగన్ ని నిజమైన బలమైన నాయకుడుగా చూపించే ప్రయత్నం చేశాడే తప్పిస్తే ఎక్కడా కూడా ప్రతిపక్ష పార్టీని తొక్కే విధంగా చూపించలేదు . దర్శకడికి ఆ విషయంలో హ్యాట్సాఫ్ చెబుతున్నారు జనాలు. అంతేకాదు ఈ సినిమాలో కొన్ని కొన్ని డైలాగ్స్ కొన్ని కొన్ని సీన్స్ అభిమానలను బాగా ఆకట్టుకుంటున్నాయి.
మరీ ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జగన్ కలిసి నటించిన సీన్స్ కొన్ని అభిమానులను కన్నీళ్లు తెప్పిస్తున్నాయి . కోలీవుడ్ యాక్టర్ జీవా జీవించేసాడు . జగన్ హవ భావాలను డిట్టో గా దించేశాడు . ఈ పాత్రకు జీవా తప్పిస్తే మరి ఎవరు సెట్ అవ్వరు. అది అందరికీ తెలిసిన నిజం . సినిమా మ్యూజిక్ కూడా బాగుంది . బిజిఎం కూడా హార్ట్ టచింగ్ గా అనిపిస్తుంది. సినిమా ఆటోగ్రాఫీ కూడా బాగుంది . ఎవరికి ఎంత పాత్ర రాయాలో ..? ఎవరు ఎలా నటించాలో..? క్లియర్గా అర్థం చేసుకొని డైరెక్ట్ చేసాడు మహి రాఘవ.
యాత్ర 2 సినిమా అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది . అయితే చాలామంది జనాలకు ఈ సినిమా చూసిన తరువాత..” వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోకుండా బ్రతికుంటేనే బాగుండేదేమో ..?”అప్పుడు పొలిటికల్ కెరియర్ వేరే విధంగా ఉండేది అంటున్నారు . అంతేకాదు కొన్ని కొన్ని సీన్స్ డైరెక్టర్ చూపించిన విధానం ఎవరిని కరెక్ట్ ..? ఎవరిని తప్పు అని చెప్పలేకపోతున్నారు . దీంతో జనాలకు కొత్త డౌట్లు మొదలయ్యాయి . త్వరలోనే ఏపీలో అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి .. అలాంటి మూమెంట్లో ఈ సినిమా రిలీజ్ అవ్వడమే పెద్ద హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంటే.. ఈ సినిమాలో ప్రతిపక్ష పార్టీని తప్పుగా చేసి చూపించకపోవడం మరొక విధంగా ట్రెండ్ అవుతుంది. చూద్దాం ఫస్ట్ డే కలెక్షన్స్ ఏవిధంగా ఉంటాయో..?