Tillu Square Glimpse: అక్కడ అదే ఓవర్ యాక్టింగ్ తప్పిస్తే..ఇక ఏముంది బ్రో..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న సిద్దు జొన్నలగడ్డ తాజాగా నటిస్తున్న సినిమా “టిల్లు స్క్వేర్”. గతంలో ఆయన నటించిన “డీజే టిల్లు” సినిమాకు ఈ సినిమా సీక్వెల్గా రాబోతుంది. ఈ సినిమా సిద్దు జొన్నలగడ్డ లైఫ్ను మార్చేసిన విషయం తెలిసిందే. ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయాడు . ఇప్పటికీ ఏ పెళ్లిళ్లు అయినా ఫంక్షన్ అయినా డీజే టిల్లు సాంగ్ ప్లే అవ్వాల్సిందే .

అంతలా నాటీనెస్ ను సినిమాలో పండించాడు సిద్దు జొన్నలగడ్డ . మరి ముఖ్యంగా ఆయన చెప్పిన డైలాగ్స్ ఆయన బాడీ మోడ్యులేషన్స్.. ఎక్కడికో తీసుకెళ్ళిపోయాయి .. పెట్టిన దానికి ఏకంగా 10 రెట్లు లాభాలు తీసుకొచ్చి సెన్సేషనల్ రికార్డును క్రియేట్ చేసింది . కాగా నిన్న ఆయన బర్త్డ డే సందర్భంగా ఇందులో సిద్దు తన లవర్ అనుపమ పరమేశ్వరన్ ని తీసుకొని కారులో వెళ్తూ ఉంటారు . అది ఆయన బర్త్డ డే.. కారులో వెనకాల ఫ్రెండ్ కూడా పుట్టినరోజు విషెస్ చెప్తాడు.

దీంతో అనుపమ బర్తడే విషెస్ చెబుతూ ..”లాస్ట్ ఇయర్ నువ్వు ఇదే రోజు ఏం చేసావ్ ..?” అంటూ అడుగుతుంది . ఇక గతంలో జరిగిన విషయాలను అలా అలా అంటి అంటన్నట్లు చెప్పుకొస్తాడు టిల్లు గాడు. అయితే రీసెంట్గా రిలీజ్ అయిన గ్లింప్స్ బాగానే ఉన్నప్పటికీ ఎక్కడ కూడా కొత్తదనం లేదు. గతంలో ఏ విధంగా డీజే టిల్లు సినిమాలో సిద్దు బాడి మాడ్యూలేషన్.. డైలాగ్స్ ఉన్నాయో ..ఆస్ ఇట్ ఇస్ అదేవిధంగా దించేశారు డైరెక్టర్ . అంతేకాదు రాధిక పేరు నే ఉపయోగించుకుంటూ పాపులారిటీ దక్కించుకోవడానికి చూశాడు. దీంతో కొంతమంది ఈ గ్లింప్స్ పై పాజిటివ్గా స్పందిస్తుంటే .. మరికొందరు ఎంటర్టైనింగ్ గా ఉంది కానీ కొత్తదనం లేదు .. అదే పాత చింతకాయ పచ్చడిలా.. అదే డైలాగ్స్ అదే మ్యూజిక్ .. అదే కామెడీ.. థింక్ డిఫరెంట్ బ్రో అంటూ డైరెక్టర్ కి సజెషన్స్ ఇస్తున్నారు . ప్రెసెంట్ “టిల్లు స్క్వేర్” గ్లింప్స్ వైరల్ గా మారింది..!!