“పెళ్లి పేరుతో మోసం చేసిన మహిళా నిర్మాత”.. పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన నాగార్జున..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో మోసాలు చేస్తున్న మహిళలు ఎక్కువగా కనిపిస్తున్నారు. సినిమాలో ఆఫర్ ఇస్తామంటూ డబ్బులు తీసుకొని ఎగ్గొట్టడం ఒక విధంగా ముందుకు వెళ్తుంటే.. మరి కొందరు మహిళలు దారుణాతి దారుణంగా పెళ్లి పేరుతో మోసం చేస్తున్నారు . రీసెంట్గా ఒక మహిళ నిర్మాత మోసం చేసింది అంటూ కెమెరామెన్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం సినిమా ఇండస్ట్రీలోనే సంచలనంగా మారింది .

సినిమా ఇండస్ట్రీలో మహిళ నిర్మాతగా బాగా పాపులారిటీ సంపాదించుకున్న ఆశ మల్లికా తనని మోసం చేసింది అంటూ కెమెరామెన్ నాగార్జున పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. చిలకూరు బాలాజీ ఆలయంలో వివాహం చేసుకున్నట్లు బాధితుడు ప్రూఫ్ తో సహా బయటపెట్టాడు. అంతేకాదు ఆ మహిళ నిర్మాత..” నా దగ్గర నుంచి 18 లక్షలు తీసుకుంది అని.. నన్ను మోసం చేసింది అని ఫిర్యాదులో పేర్కొన్నాడు”.. అంతేకాదు గతంలోనే ఆశ మల్లికకు రెండు వివాహాలు జరిగాయని ఈ విషయం నాకు ఆలస్యంగా తెలిసింది అని కన్నీరు మున్నీరుగా విలపించారు.

సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది . అంతేకాదు ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి జాగ్రత్తగా ఉండండి అంటూ చాలా రకాల వార్తలు వైరల్ అయినా సరే జనాలు పట్టించుకోకుండా మళ్ళీ అలాంటి మహిళల చేతిలో మోసపోతూ ఉండడం గమనార్హం . ఇలాంటివి ఎక్కువగా సినిమా ఇండస్ట్రీలోనే జరుగుతూ ఉండడం సినీ జనాలకు మింగుడు పడడం లేదు . డబ్బు కోసం ఏమైనా చేస్తారా ..?ఇంతకు తెగిస్తారా ..? అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు..!!