ఆ టాలీవుడ్ హీరో లవ్‌లో వర్ష బొల్లమ్మ.. మ్యారేజ్ కూడా ఫిక్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ బ్యూటి..

టాలీవుడ్ యంగ్‌ బ్యూటీ వర్ష బొల్లమా.. మిడిల్ క్లాస్ మెలోడీస్, పుష్పక విమానం, స్టాండప్ రాహుల్, స్వాతిముత్యం లాంటి సినిమాలతో టాలీవుడ్ లో పాపులారిటీ దక్కించుకుంది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ల వ‌రుస‌ సినిమాల్లో ఆఫర్లు అందుకుంటూ బిజీ షెడ్యూల్ ను గ‌డుపుతున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా నటించిన మూవీ ఊరు పేరు భైరవకోన. ఇందులో సందీప్ కిషన్ హీరోగా నటించాడు. వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌భిచిన ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్, టీజర్, ట్రైలర్ కూడా ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేశాయి.

ఈ సినిమా ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్‌ ప్రమోషన్స్ తో సందడి చేస్తున్నారు. ఇదిలా ఉంటే గత కొద్దిరోజుల నుంచి వర్షా బొల్లమా బెల్లంకొండ గణేష్ తో ప్రేమలో ఉన్నట్లు.. పెళ్లి కూడా చేసుకుంటుందంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ లో పాల్గొని సందడి చేసిన వర్ష మాట్లాడుతూ దీనిపై క్లారిటీ ఇచ్చింది. మేము ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్.. అయినా ఇద్దరం కలిసి బయట తిరిగిన సందర్భాలు లేవు.

ఎప్పుడు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం.. ఏదైనా నేను పోస్ట్ చేసినప్పుడు తను రియాక్ట్ అవ్వడం.. తను పోస్ట్ చేసినప్పుడు నేను రియాక్ట్ అవ్వడం లాంటి పనులు కూడా జరగలేదు. ఒకవేళ అలాంటివి జరిగితే మీరు ఈ న్యూస్ క్రియేట్ చేసిన అర్థం ఉంటుంది. మా మధ్యలో ఇలాంటివి ఏమీ జరగకుండానే ఆ వార్తలను చూసి ఆశ్చర్యం వేసింది. నిజం చెప్పాలంటే అతను మంచివాడు. మంచి ఫ్రెండ్ అంతే కానీ మాపై ఇలాంటి వ‌ర్త‌లు చూసి షాక్ అయ్యా.. ఆ తర్వాత దానికి కరెక్ట్ గా రిప్లై కూడా ఇచ్చాను అంటూ వివరించింది.