“ఆ పాట వింటే అన్ని గుర్తు వస్తున్నాయ్”..ఎమోషనల్ అయిన అనుష్క..వీడియో వైరల్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా ప్రభాస్ అనుష్కల పెళ్లి మ్యాటర్ అనే చెప్పాలి. వీళ్ళు పెళ్లి చేసుకుంటారో లేదో తెలియదు కానీ పెళ్లి చేసుకుంటే చూడాలి అంటూ మాత్రం కోట్లాదిమంది జనాలు సినీ స్టార్స్ ..పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా కోరుకుంటున్నారు . అయితే పెళ్లి వయసు దాటిపోతున్న ప్రభాస్ పెళ్లి పై ఆలోచన చేయకపోవడం.. చేతిలో సినిమాలో లేకపోయినా స్వీటీ పెళ్లి చేసుకోకుండా ఉండడం .. ఇక్కడ అభిమానులకి ఎక్కడో డౌట్లు పుట్టిస్తుంది .

త్వరలోనే ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ప్రభాస్ పెద్దమ్మ అఫీషియల్ గా స్పందించింది. దీంతో సోషల్ మీడియాలో ప్రభాస్ పెళ్లి వార్త వైరల్ గా మారింది. రీసెంట్గా అనుష్క ప్రభాస్ కలిసిన నటించిన మిర్చి సినిమాలోని “పండగల దిగివచ్చావు ” సాంగ్ గురించి ఒక పోస్ట్ పెట్టాడు నెటిజన్. అయితే ఈ వీడియో షేర్ చేసిన నెటిజన్..” ఇలాంటి పాటలు ఎప్పుడు రాస్తారు రామ జోగయ్య శాస్త్రి గారు మళ్ళీ మా ప్రభాస్ కి “అంటూ ఆయన్ని ట్యాగ్ చేశాడు .

దానికి ఆయన ఇంట్రెస్టింగ్ ట్వీట్ కూడా చేశారు . “ఆ సినిమా ప్రయాణం ఒక అందమైన జ్ఞాపకం ..శివ గారితో యూవీ క్రియేషన్తో మొట్టమొదటిసారి సూపర్ ఆల్బమ్ .. దేవిశ్రీప్రసాద్ గారితో వర్క్ చేయడం హ్యాపీ డార్లింగ్ తో పండగల పాట కలిసి వినడం.. మళ్ళీ మళ్ళీ అన్నీ నాకు గుర్తొస్తున్నాయి .. ఆ మూమెంట్లో ఈ పాట విని అనుష్క గారు ఎమోషనల్ అయ్యారు ..ఆ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను “అంటూ రాసుకు వచ్చారు . ప్రెసెంట్ రామజోగయ్య శాస్త్రి గారు చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. అంతేకాదు మిర్చి లాంటి కాంబో మళ్లీ రిపీట్ అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది..!!