ఫ్లాప్ టాక్ తో హిట్ కొట్టిన ప్రభాస్ సినిమా ఏంటో తెలుసా..?

ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ మొదటి సినిమా సక్సెస్ తరువాత పలు సినిమాలతో ఫ్లాప్స్ ఎదుర్కొన్న.. తర్వాత మెల్లమెల్లగా ప‌లు సినిమాల్లో నటిస్తూ ఎన్నో హిట్లు తన ఖాతాలో వేసుకుంటూ స్టార్ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో అగ్ర హీరోగా దూసుకుపోతున్న డార్లింగ్.. ఇటీవల సలార్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీతో మరోసారి రూ.700 కోట్ల గ్రస్ కొల‌గొట్టిన‌ టాలీవుడ్ హీరో మరొకరు లేరు అనేది ప్రూవ్ చేశాడు.

ఇదిలా ఉంటే ప్రభాస్ ఇటీవ‌ల‌ చేస్తున్న దాదాపు అన్ని సినిమాలు ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాల స్థాయిని పెంచే విధంగా ఉంటున్నాయి. అయితే ఈయన నటించిన కొన్ని సినిమాలు మొదట ప్లాప్, యావరేజ్ టాక్‌ను తెచ్చుకున్నా.. ఆ తర్వాత మంచి సక్సెస్ అందుకున్నాయి. ఆ సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. బుజ్జిగాడు సినిమాని చూస్తుంటే మొదట యావరేజ్ సినిమాగా నిలిచినా.. తర్వాత సూపర్ హిట్ సినిమాగా టాక్ సంపాదించి కలెక్షన్ల వర్షం కురిపించింది.

SALAAR - PRABHAS" Sticker for Sale by Srirangarakesh | Redbubble

తర్వాత బిల్లా సినిమా కూడా స్టైలిష్ గా ఉంది అనే టాక్ తెచ్చుకుని.. కొంతమందిలో నెగిటివ్ టాక్ వచ్చిన.. లాంగ్ రన్ తో హిట్ గా నిలిచింది. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా కూడా మొదట యావరేజ్ టాక్ వ‌చ్చి తర్వాత సూపర్ సక్సెస్ సాధించి బ్లాక్ బస్టర్గా నిలిచింది. అలాగే రీసెంట్ గా వచ్చిన స‌లార్ సినిమా కూడా మొదట మిక్స్డ్ టాక్ ను తెచ్చుకున్నప్పటికీ.. తర్వాత లాంగ్ రన్ సూపర్ హిట్గా.. భారీ కలెక్షన్లను కొల్లగట్టి.. బ్లాక్ బస్టర్ గా నిలిచింది.