హనుమాన్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?!

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ హనుమాన్. మన దేశంలోనే సూపర్ మ్యాన్ కాన్సెప్ట్‌తో రిలీజ్ అయిన మొట్టమొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఈ ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 12న స్టార్ హీరోల సినిమాలతో పోటీగా రిలీజై బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకుంది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా రిలీజ్ అయి నెల దాటినా ఇప్పటికీ కొన్ని థియేటర్స్ లో ఆడుతూ కలెక్షన్లు కురిపిస్తూనే ఉంది. రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన రికార్డులు సృష్టించిన హనుమాన్ సినిమా.. ఓటిటి రిలీజ్ కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

వారందరికీ ఇటీవల ఓ గుడ్ న్యూస్ వినిపిస్తుంది. త్వరలోనే ఈ బ్లాక్ బస్టర్ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌.. జీ 5 హనుమాన్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తేజ సజ్జ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందట. మార్చి 2 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే రానుందట. కాగా థియేటర్ రిలీజ్ జరిగిన తర్వాత మూడు, నాలుగు వారాలు గ్యాప్ లో హనుమాన్ ఓటీటీలోకి తీసుకురావాలని మేకర్స్ భావించారు.

How brands are leveraging OTT platform ZEE5 to enhance engagement

అయితే ఆడియన్స్ నుంచి వచ్చిన హ్యుజ్ రెస్పాన్స్ కు స్ట్రీమింగ్ వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పుడు థియేటర్ కూడా చివరకు రావడంతో.. మార్చ్‌ నుంచి హనుమాన్ అన్ని భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధం చేస్తున్నారట. కాగా హనుమాన్ మూవీ టికెట్లు ధరపై కూడా ఇటీవల భారీ డిస్కౌంట్ ఇచ్చారు. రూ.175 టికెట్ రూ.100కు మల్టీప్లెక్స్ లో రూ.250 గా ఉన్న టికెట్ ధర రూ.150కి కుదించారు. ఫిబ్రవరి 16 నుంచి 23 వరకు ఈ టికెట్స్ అందుబాటులో ఉంటాయని మేకర్స్ వివరించారు.