“అదే గుంటూరు కారం కొంప ముంచేసింది”.. నిర్మొహమాటంగా పచ్చిగా చెప్పేసిన గోపాల కృష్ణ..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో గుంటూరు కారం సినిమాపై ఎలాంటి ట్రోలింగ్ జరిగిందో మనం చూసాం. మరీ ముఖ్యంగా ఎప్పుడు కూడా నెగిటివ్ ట్రోలింగ్ జరగని మహేష్ బాబు పై కూడా దారుణాతి దారుణంగా బూతులతో రెచ్చిపోయారు ఆకతాయిలు. అసలు బుద్ధి ఉన్న వాడు.. ఈ సినిమాను తెరకెక్కిస్తాడా..? ఏ హీరో అయినా ఈ సినిమాలో నటిస్తాడా ..? అంటూ దారుణంగా రెచ్చిపోయారు ఆకతాయిలు . సోషల్ మీడియాలో ఈ సినిమా ఎదుర్కొన్న ట్రోలింగ్ అంతా కాదు అనే చెప్పాలి .

రీసెంట్గా ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం ఇదే అంటూ బిగ్ బాంబ్ పేల్చాడు పరచూరి గోపాలకృష్ణ . సినిమా ఇండస్ట్రీలో ఆయనకంటూ ప్రత్యేక ఫాన్ ఫాలోయింగ్ ఉంది . ప్రత్యేక చరిత్ర కూడా ఉంది . స్టోరీ విని ఏ సినిమా ఎప్పుడు ఆడుతుంది .. ఎన్ని రోజులు ఆడుతుంది.. ఆ సినిమాకి అసలు ప్రాణం ఉందా..? లేదా..? అన్న విషయాలను చెప్పేస్తాడు . అలాంటి ఆయన గుంటూరు కారం సినిమాపై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి .

తాజాగా తన యూట్యూబ్ ఛానల్ లో గుంటూరు కారం గురించి మాట్లాడుతూ..” 350 సినిమాలకు పైగా వర్క్ చేసిన నాకు ఈ సినిమా స్టోరీ అర్థం కాలేదు.. బహుశా రెండోసారి ఏమన్నా అర్థమవుతుందేమో ..? చూస్తే కానీ తెలియదు . ఈ సినిమా టైటిల్ లో ఘాటు లేదు.. అందుకే సినిమా ఫ్లాప్ అయింది .. తల్లి కొడుకు సెంటిమెంట్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు.. గుంటూరు కారం అసలు టైటిల్ మ్యాచ్ అవ్వలేదు ..గుంటూరు వారి అబ్బాయి అని పెట్టుంటే కచ్చితంగా సినిమాకి ప్లస్ పాయింట్స్ వచ్చుండేటివి.. మహేష్ కూడా హిట్ అందుకునేవాడు ” అంటూ సినిమాపై సంచులను కామెంట్స్ చేశారు . సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయ్..!!