సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ తమ ఒరిజినల్ పేరుతో కాకుండా రకరకాల పేర్లతో ట్రెండ్ అవుతూ ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేర్లను కూడా మార్చుకుంటూ ఉంటారు . ఆ లిస్టులోకి చాలామంది స్టార్ సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు . తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి. పేరుకు కన్నడ బ్యూటీనే అయిన తెలుగులో బాగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ ప్రెసెంట్ పలు తెలుగు – తమిళ్ – మలయాళం సినిమాలతో బిజీబిజీగా ముందుకెళ్తుంది.
రీసెంట్గా సోషల్ మీడియాలో కృటి శెట్టికి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. కృతి శెట్టి ఒరిజినల్ పేరు కృతశెట్టి కాదట . ఆమె ఇండస్ట్రీలోకి రాకముందే తన పేరును మార్చేసుకుందట. ఆమె ఒరిజినల్ పేరు “అద్వైత”. తల్లిదండ్రులు ఆమె పుట్టగానే ఇదే పేరుతో నామకరణం చేశారట. కానీ ఆమె పేరుని పలకడం రాక చాలామంది ఆమె పేరుని వ్యంగ్యంగా పలకడం మొదలుపెట్టారట .
దీంతో బాధపడిపోయిన కృతశెట్టి తన పేరుని తానే మార్చేసుకుందట . తల్లిదండ్రులు కూడా ఆమె ఇష్ట ప్రకారమే సైలెంట్ గా అయిపోయారట. ఇది తెలుసుకున్న జనాలు నవ్వేస్తున్నారు. తల్లిదండ్రుల పెట్టిన పేరుని మార్చుకుంటారా..? బుద్ధుందా ..? అంటూ తిడుతున్నారు . మరికొందరు ఈ రోజుల్లో ఇలాంటివి కామన్ అంటూ కొట్టి పడేస్తున్నారు. అయితే ఇలా పేరు మార్చుకున్న బ్యూటి కృతి శెట్టి ఒక్కటే కాదు..ఇండస్ట్రీలో చాలా మంది ఇలా పేర్లు మార్చుకున్నారు..!!