మెగా అభిమానులకి పిచ్చెక్కించే న్యూస్ చెప్పిన వరుణ్ తేజ్.. కరెక్ట్ టైంలో భలే మ్యాటర్ లీక్ చేసేశాడుగా..!!

ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో వైరల్ గా మారింది . మెగా కుటుంబానికి సంబంధించిన టాప్ సీక్రెట్ ని లీక్ చేసేసాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ . రీసెంట్గా ఆయన నటించిన సినిమా ఆపరేషన్ వాలంటైన్. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుసగా బిజీబిజీగా షోస్ కి అటెండ్ అవుతున్నాడు వరుణ్ తేజ్ . ఈ క్రమంలోనే సూపర్ సింగర్ షో కి కూడా అటెండ్ అయ్యాడు . ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ సీక్రెట్ ను బయట పెట్టేశాడు.

ఈరోజుల్లో ఒక ఫెస్టివల్ అంటే అందరూ కలవడం గగనంగా మారిపోయింది. మరి అలాంటిది బోలెడు మంది హీరోలు ఉన్న మెగా ఫ్యామిలీ మాత్రం చిన్న ఫంక్షన్ అయినా సరే ఒక్క చోట చేరి ఆహ్లాదకరంగా.. ఆనందకరంగా జరుపుకుంటుంది . దీనికి సంబంధించిన ప్రశ్న వేసినప్పుడు వరుణ్ ఎక్సలెంట్ ఆన్సర్ ఇచ్చారు . దీనంతటికీ కారణం మెగాస్టార్ చిరంజీవి గారే.. ఆయనే ఆరు నెలల ముందే డేట్ ని ఫిక్స్ చేస్తాడు .

ఈ టైం లో మనం సెలబ్రేట్ చేసుకోవాలి ..మీ కాల్ షీట్స్ ఫిల్ చేసుకోకండి అని.. అందరికీ టెక్స్ట్ మెసేజ్ చేస్తారు . అలా ప్రతి ఈవెంట్ ని ప్రతి పండుగను మెగా ఫ్యామిలీలో ఆయనే ముందుగా ప్లాన్ చేసి సెలెబ్రేట్ చేస్తారు అంటూ చెప్పుకు వచ్చారు. దీంతో మెగా ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు . మెగాస్టార్ ఊరికే అయిపోరు.. ఇలాంటివి చేస్తేనే అవుతారు .. ఇదే మెగాస్టార్ రియల్ క్యారెక్టర్ అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు..!!