ఆ విషయంలో అన్న తారక్, కళ్యాణ్ రామ్ లనే మించిపోయిన మోక్షజ్ఞ.. బాలయ్య కొడుకా మజాకా..

నందమూరి నట‌సింహం బాలకృష్ణ నటవారసుడిగా మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక మోక్షజ్ఞ ఎంట్రీ కోసం సినీ ఇండస్ట్రీ తో పాటు నందమూరి అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మోక్షజ్ఞ అప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడు.. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడంటూ వార్తలు రావడం వాటిపై ఫ్యాన్స్ ఆశలు పెట్టుకోవడం.. చివరికి ఆ ఆశ‌లు నిరాశల‌వ‌టం కామన్ అయిపోయింది. అసలు మోక్షజ్ఞకు ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఉందా.. లేదా.. అనే క్లారిటీ కూడా ఎవ్వరిలోనూ లేదు.

Kalyan Ram Ignores Nandamuris- Follows Only Jr NTR

బాలయ్యను ఎప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి అడిగిన ఈ ఏడాది.. వచ్చే ఏడాది అంటూ మాట దాటేస్తాడు.. తప్ప సరైన క్లారిటీ ఇవ్వలేదు. మరోపక్క మోక్షజ్ఞ ఇంకా హీరోకి సరిపడే విధంగా తన బాడీ షేపింగ్స్ లేవని.. బొద్దుగా ఉండడంతో.. లూక్స్ హీరోలా లేకపోవడంతో విమర్శలు వస్తాయని ఆయన కొంత టైం తీసుకుని మరీ హీరోల మాడడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అని వార్తలు వినిపించాయి. ఈ నేప‌ధ్యంలో మోక్షజ్ఞ కొత్త లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఆయన లుక్ మొత్తం మారిపోయింది. ఒకప్పుడు బొద్దుగా కనిపించే మోక్షజ్ఞ ఇప్పుడు బరువు తగ్గి మంచి స్లిమ్ లుక్ లో ఫిట్ గా కనిపిస్తున్నాడు.

Image

హీరోగా లాంచ్ అవ్వడానికి రెడీ అవుతున్నట్లు ఈ పిక్స్ చూస్తే అర్థమవుతుంది. తాజాగా మోక్షజ్ఞ కొత్త ఫోటో తెగ వైరల్ అవుతున్నాయి. మోక్షజ్ఞ అన్నలు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్‌లు కూడా ఈ పిక్ లో కనిపించారు. ఇక కర్లీ హెయిర్.. ఆ కళ్ళు, టీనేజ్ లో అన్నల అందాన్ని మించిపోయి మరి మరింత అందంగా కనిపిస్తున్నాడు మోక్షజ్ఞ. దీంతో అన్నలను మించి మోడ్రన్ లుక్ లో తన అందంతో ఆకట్టుకుంటున్నాడు.. బాలయ్య కొడుకు అంటే ఇలానే ఉంటుంది.. మోక్షజ్ఞా నా మజాకాన.. ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే హీరోగా ఎంట్రీ ఇవ్వు బ్రో అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ ఏడాదైనా బాలయ్య కొడుకుని ఇండస్ట్రీకి పరిచయం చేస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే.