పవన్, తారక్ లతో తలపడనున్న చైతన్య.. తట్టుకొని నిలబడతాడా..

టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రలో.. సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న మూవీ తండేల్‌. చందు మొండేటి డైరెక్షన్‌లో గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ తో పాటు ఎసెన్స్ ఆఫ్ తండెల్ అంటూ గ్లింప్స్‌ కూడా రిలీజై భారీ రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక నాచురల్ బ్యూటీ సాయి పల్లవి, చైతన్య కాంబోలో గతంలో వచ్చిన లవ్ స్టోరీ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో వీరిద్దరి కాంబో పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

OG vs దేవర.. గ్లింప్స్ లో ఎవరు తోపు | OG vs Devara Who is topu in Glimpse?

అలాగే ఇప్పటివరకు వచ్చిన తండల్ మూవీ అప్డేట్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. అయితే ప్రస్తుతం సరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్ పై సాలిడ్ అప్డేట్స్ వైరల్ గా మారాయి. ఈ మూవీ దసరా కానుక అక్టోబర్ 11న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దీంతో ఈ మూవీకి పెద్ద రిస్క్ ఉండవచ్చని తెలుస్తుంది. అదేంటంటే.. ఇప్పటికే టాలీవుడ్ నుంచి 2 పెద్ద సినిమాలు ద‌స‌రా బ‌రిలో బ్లాక్ అయ్యాయి.

Thandel: Naga Chaitanya turns fisherman for his next with Sai Pallavi. See  poster - India Today

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తున్నారు. అలాగే 13 రోజుల గ్యాప్ లో ఎన్టీఆర్ దేవర సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో తండేల్ సినిమాను ఈ రెండు సినిమాల మధ్యలో తీసుకొస్తే.. నాగచైతన్యకే ప్రమాదం అంటూ సినీ ప్రముఖులు సూచిస్తున్నారు. అయితే ఇప్పటికీ తండేల్ సినిమా రిలీజ్ పై మేకర్స్ నుంచి ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.