అయ్యయ్యో..బండ్ల గణేష్ ఇలా ఇరుక్కుపోయాడు ఏంటి..? బండ బూతుల వీడియో వైరల్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో బండ్ల గణేష్ కి ఎలాంటి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. కమెడియన్గా తన కెరియర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత కష్టపడి ఎదిగి సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా మారాడు. పలు మంచి సినిమాలను ప్రొడ్యూస్ చేసి హ్యూజ్ ప్రాఫిట్స్ కూడా అందుకున్నాడు .

ఆ తర్వాత పొలిటికల్ పరంగా కూడా టచ్ చేశాడు. రీసెంట్గా బండ్ల గణేష్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఈ వీడియోలో బండ్ల గణేష్ బూతులు తిట్టడం అభిమానులకి షాకింగ్ గా ఉంది . వీడియో ఆధారంగా ఓ దంపతులకు బండ్ల గణేష్ వార్నింగ్ ఇస్తున్నట్లు కనిపించారు . తన ఆఫీసుకు వచ్చిన ముస్లిం దంపతులతో మాట్లాడుతున్నట్లు బండ్ల గణేష్ కనిపిస్తారు.

ఓవైపు బండ్ల గణేష్ మాట్లాడుతూ ఉంటేనే మరోవైపు తన అనుచరుడు ఘర్షణ పడుతూనే ఉంటాడు . దీంతో చివరికి బండ్ల గణేష్ కూడా “అమ్మ నీ…” అంటూ ఆ దంపతులను బూతులు తిడతారు . ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది . ఇదంతా ఓ ఇంటి స్థలం నుంచి వారిని ఖాళీ చేయించే ప్రయత్నం గా తెలుస్తుంది. ఇందులో తప్పు ఎవరిది అన్న దాని పై ఇంకా స్పష్టత రాలేదు..!!