చావు అంచుల వరకు వెళ్లి బయటపటిన రష్మిక.. జస్ట్ మిస్.. లేకుంటే గొవిందా గోవిందా..అంతే..!!

రష్మిక మందన్నా.. ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . నేషనల్ క్రష్ గా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . రీసెంట్గా వచ్చిన యానిమల్ సినిమాతో బోల్డ్ బ్యూటీగా ట్యాగ్ చేయించుకుంది . రష్మిక మందన్నా.. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎక్కువ ముచ్చటిస్తూనే ఉంటుంది . వాళ్లకి కావాల్సిన అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది . రీసెంట్గా రష్మిక అభిమానులకు గుండె జారిపోయి మళ్లీ సెట్ అయినటువంటి పరిస్థితి నెలకొంది.

రష్మిక మందన్నా భారీ ప్రమాదం నుంచి తప్పించుకుంది . ఈ విషయాన్ని ఆమె స్వయాన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. రష్మిక మందన్నా ఇంస్టాగ్రామ్ లో ఓ స్టోరీని పోస్ట్ చేస్తూ..” ఇది మీ అందరి సమాచారం కోసం చెబుతున్నాను ..చావు అంచుల దగ్గర నుంచి బయటపడ్డాను .. ఇది నిజంగా నా లైఫ్ లో మర్చిపోలేనిది “అంటూ రాసుకొచ్చింది. పక్కనే మరో హీరోయిన్ శ్రద్ధా దాస్ కూడా ఉంది.

దీంతో సోషల్ మీడియాలో రష్మిక మందన్నా పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. అయితే కొందరు రష్మిక మందన్నా పెట్టిన పోస్ట్ పై టెన్షన్ పడిపోతున్నారు . పూర్తిగా క్లారిటీగా చెప్పు రష్మిక అంటున్నారు ..మరికొందరు మాత్రం వ్యంగ్యంగా కౌంటర్స్ చేస్తున్నారు … అమ్మ బాబోయ్ రష్మిక అంత పెద్ద సమస్య నుంచి బయటపడిందా? జస్ట్ మిస్ లేకపోయి ఉంటే పరిస్థితి ఏ విధంగా ఉండేదో అంటూ వెటకారంగా ట్రోల్ చేస్తున్నారు..!!