బిగ్‌బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ గా షణ్ముఖ్ జస్వంత్ ప్రేక్షకులో భారీ పాపులారిటీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో షణ్ముఖ్ జస్వంత్ కొన్నేళ్లు దీప్తి సునైనా ప్రేమలో ఉన్న.. అతనికి బ్రేకప్ చెప్పి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది దీప్తి సునైనా. నిజానికి వీళ్ళిద్దరూ యూట్యూబ్లో వెబ్సైట్ షాట్స్ చేస్తూ భారీగా ప్రయోజనం దక్కించుకున్నారు. ఆ తర్వాత ముందు దీప్తి బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి ఫేమ్ సాధించింది. తన అందం క్యూట్ నెస్ తో అబ్బాయిలను ఫిదా చేసింది.
బిగ్ బాస్ దీప్తి సునైనా, షణ్ముఖ్ ఇద్దరికీ బ్రేకప్ అయిన అప్పుడప్పుడు వారిద్దరి ఫ్యాన్స్ ఒకరినొకరికి గుర్తు చేస్తూనే ఉంటారు. రీసెంట్గా వాలెంటైన్స్ డే సందర్భంగా జశ్వంత్.. దీప్తి సునయనతో బ్రేకప్ పై మరోసారి రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. అసలు విషయం ఏంటంటే వాలెంటైన్స్ డే భాగంగా తన అభిమాని అడిగిన ఓ ప్రశ్నకు ఫన్నీగా ఆన్సర్ ఇచ్చాడు షణ్ముఖ్. బ్రేకప్ అయినా ఇంత హ్యాపీగా ఎలా ఉంటున్నావో చెప్పు బ్రో అంటూ షణ్ముఖ్ ఫ్యాన్స్ ఒకరు అతనిని ప్రశ్నించగా.. పవన్ కళ్యాణ్ మూవీ లో పాట లిరిక్స్ ను ఆన్సర్ ఇచ్చాడు షణ్ముఖ్.
” కోరుకున్నది పోతే వెళ్లిపోనిలే.. బాధపడడం.. బెంగపడడం.. మనకి రాదసలే ” అనే సాంగ్ రిప్లై ఇచ్చి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు. ఇలా నేరుగా దీప్తి సునయనతో బ్రేకప్ పై స్పందించడం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. చివరిగా స్టూడెంట్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు షణ్ముఖ్. మరో పక్క దీప్తి సునైనా కొన్ని ప్రైవేటు సంగ్స్‌తో పాపులారిటీ దక్కించుకుంటుంది.