పవన్ ఓజీ స్టోరీ లైన్ అదేనా.. ఇక బ్లాక్ బస్టర్ పక్క అంటూ..

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. జనసేన అధినేత.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఏపీ ఎన్నికలు కావడంతో పవన్ సినిమాలో షూటింగ్ వాయిదా వేయాల్సి వచ్చింది. సుజిత్, పవన్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ చేశారు. సెంటిమెంట్ ప్రకారం ఈ డేట్ అత్తారింటికి దారేది సినిమా రిలీజ్ డేట్ కావడంతో.. ఓజి కూడా అదే రెంట్ లో బ్లాక్ బస్టర్ సృష్టిస్తుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే గూగుల్ ఐఎండిబి పేజ్ లో ఓజి మూవీ స్టోరీ లైన్ ఇదేనంటూ ఓ స్టోరీ లైన్ తెగ వైరల్ అవుతుంది.

Interesting update on They Call Him OG - 123telugu.com

వైరల్ అవుతున్న స‌మాచారం ప్రకారం ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీర్‌ అనే రోల్ లో కనిపించబోతున్నాడు. ముంబై లో 10 ఏళ్ల క్రితం ఓజస్ గంభీర్ అనే గ్యాంగ్ స్ట‌ర్ ఉండగా అతని దగ్గర ఎన్నో గ్యాంగ్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్ అన్నింటికీ ఓజస్ గాంబీర్ గ్యాంగ్ లీడర్ గా వ్యవహరిస్తూ ఉంటాడు. కొన్ని కారణాలతో ముంబైకి దూరమైన ఓజాస్.. పదేళ్ల తర్వాత అక్కడకు రీఎంట్రీ ఇస్తాడు. పదేళ్ల తర్వాత మళ్ళీ ఓజాస్‌ ఎంట్రీ ఇవ్వడానికి కారణం ఏంటి..?

OG: Pawan Kalyan, Emraan Hashmi's Film To Hit Theatres On September 27 -  Reports | 🎥 LatestLY

తన శత్రువులపై ఓజస్ ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు..? ఆ పదేళ్లపాటు ఒజాస్‌ ఎక్కడ ఉన్నాడు..? ఏం చేశాడు..? అనే అంశాలు ఈ సినిమాలో చూపించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పవన్ లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అదే లెవెల్ లో సినిమా మొత్తంలో పవన్ కళ్యాణ్ లుక్స్ ఉంటాయట. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తాయంటూ టాక్.