బన్నీ ఫ్యాన్స్ కు గూస్ బంప్ అప్డేట్.. ఆ క్రేజీ డైరెక్టర్ తో మూవీ ఫిక్స్.. డీటెయిల్స్ ఇవే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవ‌ల్‌లో పాపులారిటీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో నేషనల్ అవార్డుతో పాటు ఇంటర్నేషనల్ వేదికపై అల్లు అర్జున్ మెరిసి మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. అయితే ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న అల్లు అర్జున్.. తన నెక్స్ట్ సినిమాలకు వరుసగా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబో ఒకటి ఫిక్స్ అయింది.

అయితే వీరిద్దరి కాంబోలో ఇది నాలుగో సినిమా కావడంతో ప్రేక్షకుల మంచి హైప్ నెలకొంది. ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగతో మరో సినిమా చేస్తున్నట్లు బన్నీ అఫీషియల్ గా అనౌన్స్ చేసాడు. కాగా కోలీవుడ్ క్రేజీ డైరెక్టర్ అట్లీతో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా తీయబోతున్నాడంటూ ప్రస్తుతం వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయిందట.

అయితే ఇప్పుడు ఈ సినిమాపై గూడ్స్ బంప్ తెప్పించే అప్డేట్స్ వైరల్ అవుతున్నాయి. అట్లీ, అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా సన్ పిక్చర్స్, గీత ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మ్యూజిక్స్ సెన్సేషన్ అనిరుధ్ ర‌విచంద్రన్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా కన్ఫర్మ్ అయ్యాడు. ఇక ఈ మూవీలో త్రిషను హీరోయిన్గా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇంకా వీటిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.