సీనియర్ ఎన్టీఆర్ కి ఉపాసన తాతయ్య అంత పెద్ద సహాయం చేశారా.. ఇన్నాళ్లకు రివీలైన టాప్ సీక్రెట్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో స్టార్ హీరోగా రామ్ చరణ్ దూసుకుపోతుంటే, వైద్యరంగంలో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకొని కీర్తిని సంపాదించుకుంటుంది ఉపాసన. అయితే రామ్ చరణ్ , ఉపాసనల ప్రేమ వివాహం జరిగే వరకు ఉపాసన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి ఎవరికి తెలియదు. వీరి వివాహమైన తరువాతనే ఉపాసనకు సంబంధించిన అన్ని విషయాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం మొదలయ్యాయి. అయితే ఉపాసన తాతయ్య ప్రతాపరెడ్డి గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఉపాసన తాతయ్య అపోలో హాస్పటల్ చైర్మన్.. ప్రతాప్ చంద్ర రెడ్డి 1933లో జన్మించాడు. 90 ఏళ్ళు దాటిన ఆయన ప్రపంచ ప్రఖ్యాత కార్డియాలజిస్ట్. 1983లో భారత దేశంలోనే మొట్టమొదటి కార్పొరేట్ ఆసుపత్రిని స్థాపించాడు. చెన్నైలోని.. స్టాండ్లై మెడికల్ కళాశాలలో చదువును పూర్తి చేసిన ఆయన.. తర్వాత అమెరికా, ఇంగ్లాండ్ వెళ్లి ఉన్నత వైద్యాన్ని నేర్చుకొన్నాడు.

ఈ క్రమంలోనే సుచరితను వివాహం చేసుకున్నాడు. వీరికి నలుగురు ఆడపిల్లలు జన్మించారు. ప్రతాప్ రెడ్డిది చిత్తూరు జిల్లా.. హై స్కూల్ లో ఉన్నప్పుడే ఏదైనా సాధించాలనే పట్టుదలతో ప్రతాప్ రెడ్డి ఉండేవారు తొమ్మిదేళ్ల వయసులోనే గాంధీజీ ఉపన్యాసం విన్న ఆయన. స్టూడెంట్ యూనియన్ కి లీడ‌ర్‌గా వ్యవహరించారట‌. ఇక ప్రతాపరెడ్డి మంచి డాక్టర్ గా ఎదిగి ఫారన్‌ నుంచి తండ్రికి ఫోటోలు పెట్టగా.. తండ్రి రాఘవరెడ్డి ఆ ఫోటోలో చూస్తే ఎంతో ఆనందంగా ఉంది.. కానీ నువ్వు చేసే వైద్యం మీద మనదేశంలోనే చేస్తే బాగుంటుంది అంటూ ఉత్త‌రం రాశాడు. వెంటనే తండ్రి మాట విని హైదరాబాద్‌కు వచ్చిన ప్రతాప్ రెడ్డి భారత దేశంలో మొదట చిన్న రూమ్ లో తక్కువ ఫీజు తో క్లినిక్ ను మొదలుపెట్టారు. అతి తక్కువ సమయంలోనే మంచి పేరును సంపాదించిన ఈయన.. 1983 సెప్టెంబర్ లో చెన్నైలో అపోలో హాస్పిటల్ ని మొదలుపెట్టాడు.

అయితే అపోలో అంటే సూర్య భగవానుడు అని అర్థం. ఈ పేరును అతని రెండో కుమార్తె సునీత రెడ్డి సూచించారట. అయితే అమెరికాకు చెందిన డెంటల్ కూలీని తన వైద్య గురువుగా ప్రతాపరెడ్డి భావిస్తూ ఉంటారు. కూలీ గారే ప్రపంచంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ హార్ట్ సర్జరీ చేసిన వ్యక్తి. ఆ రోజుల్లో ఎన్టీఆర్ కూడా ఆయన దగ్గరే వైద్యం చేయించుకున్నారు. అయితే అప్పుడు ఎన్టీఆర్ సరిగ్గా 9 :11 నిమిషాలకు గుండెకు సంబంధించిన సర్జరీ చేయాలని కూలి గారిని కోరాడట. ఆ టైంలో కూలీ నాకు కుదరదు.. నీ సమయం వచ్చినప్పుడే నీకు చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడట. కాగా ఎన్టీఆర్ ప్రతాపరెడ్డి మధ్యన ఉన్న సానిహిత్యంతో ఎన్టీఆర్ గురించి తెలుసుకొని ప్రతాప్ రెడ్డి సూచన మేరకు ఎన్టీఆర్ కోరిన సమయానికి ఆ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారని సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చిన సీనియర్ ఎన్టీఆర్ ట్రీట్‌మెంట్ విష‌యంలో ఉపాసన తాత అంత పెద్ద సహాయం చేశారా అంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు.