ఫ్లాప్ అవుతుందని తెలిసిన బాలయ్య నటించిన సినిమా ఏంటో తెలుసా.. కారణం అదేనా..?

నందమూరి తారక రామారావు నటవరసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు బాలకృష్ణ. మొదటి తండ్రితో కలిసి పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈయన.. తర్వాత సోలో హీరోగా నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. యాక్షన్ సినిమాలకు తనకంటూ ప్రత్యేక మార్క్ క్రియేట్‌ చేసుకున్న బాలయ్య.. ప్రస్తుతం నందమూరి నటసింహంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుస సినిమాలతో బిజీ లైన‌ప్‌ ఏర్పాటు చేసుకున్న బాలయ్య.. ఇటీవల హ్య‌ట్రిక్‌ హీట్లను అందుకుని మంచి ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోల అందరిలో హిట్ పరంగా టాప్ పొజిషన్లో ఉన్న బాలయ్య.. ప్రస్తుతం తన 109వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ బాబి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ బయటకు వస్తే బాగుండని నంద‌మూరి అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే బాలకృష్ణ కథ ఎంచుకునే విషయంలో ఎప్పటికప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటాడు. కథ వినే సమయంలో కాస్త తేడాగా అనిపించిన ఆ సినిమాను రిజెక్ట్ చేసే బాలయ్య.. ఒక సినిమాను మాత్రం ఫ్లాప్ అవుతుందని తెలిసిన నటించాడట. ఇంతకీ ఫ్లాప్ అవుతుందని తెలిసిన బాలయ్య నటించిన ఆ సినిమా ఏంటో దానికి కారణం ఏంటో ఒకసారి చూద్దాం.

1983లో వచ్చిన యాక్షన్ సినిమా తిరగబడ్డ తెలుగు బిడ్డ సినిమా.. తేజస్వి ప్రొడక్షన్స్ బ్యానర్ లో.. నందమూరి హరికృష్ణ ప్రొడ్యూసర్ గా, ఏ కోదండరామిరెడ్డి డైరెక్షన్లో తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణ హీరోగా నటించాడు. అయితే ఈ సినిమా కథ వింటున్న క్రమంలో బాలయ్యకు ఈ సినిమా ఫ్లాప్ అవుతుందనే సందేహం రావడంతో సినిమాకు నో చెప్పాడట. అయితే తర్వాత ఎన్టీఆర్ కలగజేసుకుని ఈ సినిమా ఫ్లాప్ అయినా పర్వాలేదు.. ఇలాంటి సినిమాను నువ్వు నటిస్తే బాగుంటుంది చేయమని బాలయ్యకు చెప్పడంతో.. తండ్రి మాట‌ను గౌర‌వించి ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట బాలకృష్ణ. అయితే బాలయ్య ఊహించిన విధంగానే ఈ సినిమా రిలీజై డిజాస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది.