వావ్ : మెగా కోడళ్ళ న‌యా బిజినెస్.. మీ ప్లాన్ అదుర్స్ అంటూన్న ఫ్యాన్స్‌..

ఈరోజు మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిరు తనదైన స్టైల్ లో చిరు కవితతో సురేఖకు స్పెషల్ విషెస్ తెలియజేశారు. మెగా కోడలు ఉపాసన కూడా అత్తగారికి ప్రత్యేకంగా విషెస్ చెబుతూ ఓ వీడియోను షేర్ చేసింది. తాజాగా అత్తమ్మ కిచెన్స్ పేరుతో ఆన్లైన్ వ్యాపారాన్ని మొదలు పెట్టబోతున్నారట ఈ మెగా కోడలు. ఈ విషయాన్ని ఉపాసన వివరించింది. అత్తమ్మ పుట్టినరోజు భాగంగా మా వ్యవస్థాపక వెంచర్ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. సాంప్రదాయానికి అనుగుణంగా రుచి ఉండే వంటశాలలో బంధాలు తరతరాలుగా నిర్మించబడుతున్నాయి.

ఇప్పుడు మా వంటగది నుంచి మీ వద్దకే రెడీమిక్స్ రూపంలో కొన్ని ఆహార పదార్థాలు వస్తాయి. మీరు కూడా మీ ఇంట్లో వాటిని ఆస్వాదించండి అంటూ ఆమె ఆ వీడియోలో వివరించింది. ప్రస్తుతం ఆ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. ఉప్మా, పొంగల్, పులిహార, రసం లాంటి ఉత్పత్తులు ప్రస్తుతం కొనుగోలు కూడా చేస్తున్నారు. ఈ నాలుగు ప్యాకెట్ల ధర రూ.1,099 ఉంది. ఆన్లైన్లో డబ్బులు చెల్లించి వాటిని కొనుక్కోవచ్చు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తమ ఆహార ఉత్పత్తులు అందుతాయి అంటూ వాళ్ళు వివరించారు.

అత్తమ్మ కిచెన్ అనేది తెలంగాణలోని హైదరాబాద్‌లో ఉన్న ఓ వినూత్నమైన రెడీమేడ్ మిక్స్ ఫుడ్ బిజినెస్ మా కంపెనీ నుంచి సౌత్ ఇండియా వంటకాల్లో ముఖ్యమైన వాటిని అందిస్తున్నాం. ప్రామాణికమైన రుచికరమైన హోమ్లీ వంటకాలను అందిస్తున్నందుకు మాకు గర్వంగా ఉంది. ఎప్పుడైనా ప్రయాణంలో ఉన్నవాళ్లు ఇంటి ఫుడ్ తినాలంటే అది మరింత సులువు. అత్తమ్మస్ కిచెన్ ద్వారా మా ఇంటి ఫుడ్ మీ ఇంటికే వస్తుంది. ఈ ఉత్పత్తులన్నీ భారతీయ గృహ శైలిలో ఎంతో నిబద్ధతతో తయారు చేస్తున్నామంటూ వివరించారు. ఇంకెందుకు ఆలోచన మెగాస్టార్ భార్య చేతి వంట‌లు మీరు కూడా ఆస్వాదించవచ్చు.