మహేష్ – రాజమౌళి సినిమాకి మరో కొత్త గండం.. దరిద్రం ఈ విధంగా కూడా వెంటాడుతుందా..?

ఏంటో ..మహేష్ రాజమౌళి సినిమాలకు ప్రతిదీ పెద్ద అడ్డంకు గా మారిపోతుంది. నిజానికి వీళ్ళ కాంబోలో సినిమా వస్తుంది అంటూ ఎప్పుడో వార్తలు వినిపించాయి . దాదాపు ఒకటిన్నర సంవత్సరం ముందే వీళ్ళిద్దరి కాంబోలో సినిమా రాబోతుంది అంటూ ఇండస్ట్రీలో ప్రచారం జరిగింది. ఫైనల్లీ ఆ న్యూస్ ని సంవత్సరం క్రితమే రాజమౌళి కన్ఫామ్ చేశారు . మహేష్ బాబు కూడా పలు సందర్భాలలో రాజమౌళితో నెక్స్ట్ సినిమాని ఫిక్స్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చాడు .

ఇప్పటివరకు దీనిపై అఫీషియల్ గా ప్రకటన రానప్పటికీ ఈ ప్రాజెక్టు గురించి చక చక పనులను పూర్తి చేసుకుంటున్నాడు రాజమౌళి. అయితే రీసెంట్గా ఈ సినిమా నిర్మాణంలో భాగమైన ఎస్ గోపాల రెడ్డి సినిమా పై సంచలన కామెంట్స్ చేశారు . “రాజమౌళి నాలుగో సినిమా చేస్తున్నప్పుడే అతను భవిష్యత్తులో గొప్ప దర్శకుడు అవుతాడని నేను భావించాను.. ప్రెసెంట్ మహేష్ బాబుతో చేయబోయే సినిమా స్క్రిప్ట్ చివరి స్టేజిలో ఉంది ..వచ్చే ఏడాది ఈ సినిమా వచ్చే ఏడాది మేలో ప్రారంభం కాబోతుంది ” అంటూ చెప్పుకొచ్చాడు .

దీంతో ఒక్కసారిగా అభిమానుల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది . మరికొద్ది వారాల్లో లేకపోతే నెలలో స్టార్ట్ అవ్వబోతుంది ఈ సినిమా అనుకుంటే ఏకంగా ఏడాది పాటు బ్రేక్ చెప్పారా..? ఏంటి ఇది.. 2025 మేలో షూటింగ్ కి వెళ్ళబోతుందా..? ఈ సినిమా..? ఇది నిజంగా పెద్ద బాడ్ న్యూస్ ..అంటూ చెప్పుకొస్తున్నారు . రాజమౌళి సినిమాకి ఆయన ఆలస్యమే ఒక గండంలా మారింది అని ఇంతింత గ్యాప్ తీసుకోకూడదు అంటూ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు . మరికొందరు గుంటూరు కారం దరిద్రం ఇంకా మహేష్ బాబు ని వెంటాడుతుంది అంటూ ట్రోల్ చేస్తున్నారు..!!