మహేష్ – నమ్రత పెళ్లికి సూపర్ స్టార్ కృష్ణ అలాంటి కండిషన్ పెట్టాడా.. అదేంటంటే..?!

టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణ నటవార‌సుడిగా అడుగు పెట్టాడు మహేష్ బాబు. అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న మహేష్.. మెల్లమెల్లగా ఒక్కో సినిమాలో సూపర్ హిట్ అందుకుంటూ.. తండ్రికి తగ్గ తనయుడుగా సూపర్ స్టార్ బిరుదులు అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ అవడంతో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు మహేష్.

ఇక ఆయన కెరీర్‌ స్టార్టింగ్‌లో నటించిన సినిమాల్లో వంశీ సినిమా ఒకటి. ఈ సినిమా టైమ్ లోనే మహేష్ బాబు.. నమ్రతతో ప్రేమలో పడ్డాడు. అయితే మొదట్లో వీళ్ళిద్దరి ప్రేమను సూపర్ స్టార్ కృష్ణ అంగీకరించలేదు. వీళ్ళ పెళ్లికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత మహేష్ బాబు కృష్ణను కన్విన్స్ చేయడంతో పెళ్లికి ఒప్పుకున్నాడు. కాగా వీరిద్దరి మ్యారేజ్ జరగాలంటే ఒక కండిషన్ పెట్టాడట కృష్ణ. అదేంటో ఒకసారి చూద్దాం. వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలంటే ఇద్దరు ఎవరికివారుగా స్టార్ హీరో, హీరోయిన్లుగా నిరూపించుకోవాలి తర్వాతే పెళ్లి చేసుకోవాలంటూ కండిషన్ పెట్టాడట.

మొదట ఈ కండీష‌న్‌కు వారు ఒప్పుకున్నా.. తర్వాత ఆలోచించి కండిషన్ ఎక్కడో సరిగా అనిపించడం లేదు.. ఇప్పటికప్పుడు స్టార్ హీరో హీరోయిన్గా ఎలా ప్రూవ్ చేసుకుంటాం.. దానికి చాలా టైం పడుతుంది.. కాబట్టి ఈ మధ్యలో మరోసారి కృష్ణను కన్విన్స్ చూద్దామ‌ని ప్ర‌య‌త్నించార‌ట‌. మొత్తానికి ఈ జంట పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పుడు కృష్ణ మాటలు కాదని మరీ మహేష్ బాబు.. నమ్రతను పెళ్లి చేసుకోవడం ఇండస్ట్రీలో పెద్ద సంచలనంగా మారింది. ఇక ఇప్పుడైతే ఇండస్ట్రీలోనే మహేష్ బాబు – నమ్రత బెస్ట్ స్టార్ కపుల్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.