రెండు నెలలలో రెండు హిట్ లను తన ఖాతాలో వేసుకున్న మాస్ మహారాజ్.. నువ్వు కేక బ్రో అంటున్న ఫ్యాన్స్..!

టాలీవుడ్ స్టార్ హీరోస్ లో ఒకరైన రవితేజ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రవితేజ మంచి పాపులారిటీని దక్కించుకున్నాడు. ఇక రవితేజ తాజాగా నటించిన మూవీ ఈగల్.

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో అనుపమ హీరోయిన్గా నటించింది. ఇక ఈ సినిమా సంక్రాంతి బరిలోనే రావాల్సింది కానీ అనుకొని పరిస్థితులు మూలంగా నిన్న రిలీజ్ అయింది. ఇక తన ప్రజెంట్ ఉన్న సెన్సేషనల్ హిట్ చిత్రం ” హనుమాన్ “. ఈ సినిమాలో ఓ కోతి పాత్రకు డబ్బింగ్ చెప్పిన రవితేజ సూపర్ విజయాన్ని అందుకున్నాడు.

ఇక దీంతో గత నెలలో ఓ హిట్ ఈ నెలలో ఓ హిట్ అందుకుని దూసుకుపోతున్నాడు. నెలకు హిట్ అంటే మామూలు విషయం కాదనే చెప్పొచ్చు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటున్నాడు రవితేజ. ఇక ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.