ప్రియుడికి బిగ్ షాక్ ఇచ్చిన ప్రియాంక.. అతనితో పెళ్లి..!

బిగ్ బాస్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వారిలో ప్రియాంక జాన్ ఒకరు. ఉల్టా పుల్టా అనే బిగ్ బాస్ షోలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ మంచి పాపులారిటీని సంపాదించుకుంది. అబ్బాయిలకు గట్టి పోటీ ఇచ్చి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా టాప్ ఫైవ్ వరకు ఉంది ప్రియాంక. ఇక ఈమె ఇంటి నుంచి బయటకు వచ్చిన అనంతరం సీరియల్స్ కు బ్రేక్ ఇచ్చి పలు షోస్ లో సందడి చేస్తుంది.

అదేవిధంగా తన ప్రియుడు శివకుమార్తో యూట్యూబ్ ఛానల్ లో వీడియోస్ చేస్తూ సందడి చేస్తుంది. తన లైఫ్ లో జరుగుతున్న ప్రతి విషయాన్ని వీడియో తీస్తూ ప్రేక్షకులతో పంచుకుంటుంది. అంతేకాకుండా అప్పుడప్పుడు యూస్ పెంచుకునే క్రమంలో పలు ఆసక్తికర విషయాలను సైతం వెలుగులోకి తీసుకొస్తుంది. ఇక తాజాగా ప్రియాంక మరియు టేస్టీ తేజను పెళ్లి చేసుకోబోతున్నట్లు ఓ వీడియోని షేర్ చేసింది.

దీంతో అందరూ షాక్ అయ్యారు. ఈ వీడియోలో తేజ మాట్లాడుతూ.. నేను బిగ్ బాస్ లో ఉన్నప్పటి నుంచి ప్రియాంక పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెడుతుంది. అందుకే ఇదిగో ఇప్పుడే చేసుకుంటున్న…అంటూ తేజ చెప్పడంతో అక్కడే ఉన్న ప్రియాంక పక్కనే ఉన్న దండ తీసుకుని తేజ మెడలో వేస్తుంది. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోని చూసిన పలువురు రకరకాలుగా స్పందిస్తున్నారు.