ఓ మై గాడ్: బాలయ్య ఇప్పటివరకు ఏకంగా ఇన్ని సినిమాలలో డ్యూయల్ రోల్ చేశాడా.. ఆ సినిమాలు ఏంటంటే..?

నందమూరి నట‌సింహ బాలకృష్ణ ఎటువంటి పాత్రలోనే అలవొక్కగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకునే ఆయన.. తన సినీ కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటికే వందకు పైగా సినిమాల్లో నటించి మెప్పించాడు. వయసు మీద పడుతున్న కొద్ది రెట్టింపు ఎనర్జీతో సీనియర్ స్టార్ హీరోలందరిలో మంచి ఫామ్ లో దూసుకుపోతున్న బాలయ్య.. యంగ్ హీరోలకు దీటుగా హిట్లు ఇస్తూ వారికి మంచి కాంపిటీషన్ ఇస్తున్నాడు.

కాగా బాలయ్య ఇప్పటివరకు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఏకంగా 18 సినిమాల్లో ద్విపాత్రాభినయం చేశాడు. వాటిలో ఓ మూవీలో అయ్యితే త్రిపాత్రాభినయంతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇంతకీ ఆ సినిమాలేంటో ఒకసారి చూద్దాం. 1986లో అపూర్వ సహోదరుడు, 1988లో రాముడు భీముడు సినిమాల‌లో ద్విపాత్రాభిన‌యం చేశాడు. ఇక 1991లో రిలీజైన బ్రహ్మర్షి విశ్వమిత్ర, ఆదిత్య 369 ఈ రెండు సినిమాలలో ద్విపాత్రాభినయం చేశాడు.

1995లో మాతో పెట్టుకోకు, 1996లో శ్రీకృష్ణార్జున విజయం, 1997లో పెద్దన్నయ్య, 1999లో సుల్తాన్, 2002లో చెన్నకేశవరెడ్డి, 2005లో అల్లరి పిడుగు, 2008లో తెర‌కెక్కిన ఒక్క మగాడు, పాండురంగడు ఈ రెండు సినిమాల‌లో డ్యూయ‌ల్ రోల్లో న‌టించాడు. 2010లో సింహ, 2011లో పరమవీరచక్ర, 2014లో లెజెండ్, 2021లో అఖండ, 2023లో వీరసింహారెడ్డి సినిమాలలో దిపాత్రాభినయం చేశాడు. ఇక 2012లో వచ్చిన అధినాయకుడు సినిమాలో త్రిపాత్రాభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం బాలయ్య ఏకంగా 18 సినిమాల్లో డ్యూయల్ రోల్ లో నటించాడని తెలియడంతో అభిమానులంతా ఆశ్చర్యపోతున్నారు.