“చూశారా.. ఫైనల్లీ నేను చెప్పినట్లే జరిగింది”.. ప్రభాస్ పై వేణు స్వామి మరోసారి సంచలన కామెంట్స్..!

వేణు స్వామి .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . కాంట్రవర్షియల్ జ్యోతిష్కుడిగా ఇండస్ట్రీలో బాగానే పాపులారిటీ దక్కించుకున్నాడు . మరి ముఖ్యంగా స్టార్ సెలబ్రెటీస్ లైఫ్ లో జరిగే విషయాలను ముందుగానే చెప్పేస్తూ అభిమానుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నారు . ఈ మధ్యకాలంలో వేణు స్వామి చాలా మంది స్టార్ సెలబ్రిటీస్ జీవితాల గురించి ఓపెన్ గా చెప్పారు . కానీ అందరిలోకి హైలెట్ అయింది ప్రభాస్ .

పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ కెరియర్ అంత ఆసాజనకంగా లేదు అని .. హెల్త్ పరంగా కూడా ఆయన కొన్ని ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాడు అని ..ఓపెన్ గా చెప్పుకు వచ్చాడు . అయితే రీసెంట్గా మరోసారి ప్రభాస్ పై సంచలన కామెంట్స్ చేశాడు వేణు స్వామి. ” చూశారా .. నేను చెప్పిందే జరిగింది ..రాధే శ్యామ్ సినిమా ఫ్లాప్ అవుతుంది అని చెప్పాను.. ఫ్లాప్ అయింది”..

“సలార్ సినిమా ఆయన ఫ్యాన్స్ తప్పిస్తే మిగతా ఎవ్వరూ చూడరు అని చెప్పాను..అన్నట్లు అదే జరిగింది .. ఇప్పుడు కూడా చెప్తున్నాను ప్రభాస్ ఆరోగ్యం బాగోలేదు ..ఇదే నిజం.. నాలాగా ఎవ్వరూ కూడా జ్యోతిష్యం చెప్పరు..ఉన్న విషయాన్ని ఏ జ్యోతిష్యుడు బయటపెట్టాడు ” అంటూ సంచలన కామెంట్స్ చేశారు . దీంతో మరోసారి ప్రభాస్ కి సంబంధించిన న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది..!!