స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లతో అమ్మ పిలుపుకు దూరం.. నిపుణులు ఏం చెప్తున్నారంటే..?

ఇటీవల కాలంలో పెరిగిన టెక్నాలజీ కొత్త సమస్యలను తెచ్చిపెడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ ఫోన్లు పెరిగిపోవడంతో అవి చాలామంది నిజజీవితంలో భాగమైపోయాయి. ప్రతిక్షణం స్మార్ట్ ఫోన్ చేతిలో ఉండాల్సిందే. పని ప్రదేశంలో మాత్రం ల్యాప్‌టాప్ కంపల్సరీ. ఈ క్రమంలో వీటిని అధికంగా వాడడం వల్ల సంతాన సమస్యలు తలెత్తుతున్నాయని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. యునైటెడ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్.. ఇటీవల టెడ్ ఎక్స్ ఈవెంట్ ను నిర్వహించారు. టెడెక్స్ అనేది ఒక గ్లోబల్ స్థాయి ఈవెంట్. ఇందులో అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందిన ఎంతో మంది గొప్ప వ్యక్తులు స్థానికంగా నడిచే ఆలోచనలను షేర్ చేసుకుంటూ ఉంటారు.

వాటిని ఆన్ బోర్డ్ లెవెల్ లో ఎలివేట్ చేస్తారు. ఈవెంట్లో నిపుణులు లాప్టాప్, స్మార్ట్ ఫోన్స్ వాడటం వల్ల కలిగే నష్టాలను వివరించారు. ఇంతకీ ఆ నష్టాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఈ ఈవెంట్లో మానవ మనసు, ప్రవర్తలపై తమ అభిప్రాయాలను నిపుణులు షేర్ చేసుకున్నారు. అదే విధంగా ఐవిఎఫ్, ఇన్ ఫర్టిలిటీ స్పెషలిస్టులు.. వాటికి సంబంధించిన ప్రాముఖ్యతలను చెప్పుకొచ్చారు. అమ్మ అయ్యేందుకు ఈ విధానం ఎలా సాయపడుతుందనే దానిపై చర్చించారు. 40% కేసుల్లో వంధ్యత్వానికి ( పిల్లలు పుట్టకపోవడానికి ) పురుషులు మాత్రమే కారణమని తేలినట్లు చెప్పుకొచ్చారు.

ఇక దీనికి కారణం ల్యాప్టాప్‌లు, స్మార్ట్ ఫోన్‌ల‌ మితిమీరిన వినియోగమేనట. ఇది సంతాన ఉత్పత్తిపై కూడా ప్రభావం చూపుతోందని వివరించారు. అందువల్ల వీలైనంత వరకు ఆ గాడ్జెట్లకు దూరం పాటించాలని చెప్పుకొచ్చారు. అలాగే పలువురు వయసు గురించి ముందస్తు షరతులపై తమ‌ అనుభవాలను షేర్ చేసుకున్నారు. ఏజ్ గురించి ఆలోచించకుండా లైఫ్ లో ఎంజాయ్ చేయాలని చెప్పుకొచ్చారు. స్ఫూర్తి పొందే స్టోరీస్ ను తెలుసుకోవడం జీవితంలో ముందుకు సాగేందుకు సహకరిస్తుందని.. కాలేజ్ చదివే రోజుల నుంచి మొబైల్ ఫోన్ కు దూరంగా ఉంటూ ఇలాంటి ల‌క్ష‌నాలు అలవర్చుకోవాలని పేర్కొన్నారు.