“నాకు ఏమన్నా మెంటల్ అనుకుంటున్నారా..?”.. నాగార్జున షాకింగ్ కామెంట్స్ వైరల్..!

ఈ మధ్యకాలంలో సినీ స్టార్స్ వేదికలపై ఓపెన్గా తమ ప్రైవేటు అండ్ పర్సనల్ విషయాలను బయట పెట్టేస్తున్నారు. రీసెంట్గా అక్కినేని నాగార్జున మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . అక్కినేని నాగార్జున తాజాగా నటించిన సినిమా “నా సామి రంగ” . సంక్రాంతి కానుకగా బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది . ఫ్యామిలీలని బాగా ఎంటర్టైన్ చేసింది . నాటి డైలాగ్స్ చిలిపి అల్లర్లు ఈ సినిమాలో బాగా ఉన్నాయి .

 

దీంతో చాలాకాలం తర్వాత నాగార్జున హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో సక్సెస్ సెలబ్రేషన్స్ గ్రాండ్గా నిర్వహించారు నాగార్జున నా స్వామి రంగాటీం. ఈ క్రమంలోనే స్టేజిపై నాగార్జున మాట్లాడుతూ ఎప్పుడు లేని విధంగా చాలా బోల్డ్ స్పీచ్ ఇచ్చారు . ఆయన మాట్లాడుతూ ..”ఈ సినిమాను సెప్టెంబర్ 20 లాంచ్ చేసాం ..అదే రోజు మా నాన్నగారి విగ్రహ ఆవిష్కరణ కూడా ఉండింది ..త్వర త్వరగా విగ్రహ ఆవిష్కరణ పనులు పూర్తిచేసుకుని.. నా స్వామి రంగా చిత్ర లాంచింగ్ ఈవెంట్ కు వెళ్లాలి అంటూ అమలకు చెప్పాను”..

“అమల కోప్పడిపోయింది ..తర్వాత వెళ్ళొచ్చుగా.. అయినా మూడు నెలల్లో సినిమాను ఎలా రిలీజ్ చేయగలవు ..అంటూ నావైపు అందరూ విచిత్రంగా చూశారు ..ఆ టైంలో నేను మాట్లాడిన మాటలకి నాగచైతన్య – అఖిల్ – అమల ముగ్గురు కూడా నాకు పిచ్చి పట్టింది అనుకున్నారు.. ఇంత త్వరగా సినిమా కంప్లీట్ కాదు అనుకున్నారు ..ఇదంతా సక్సెస్ అవ్వడానికి కారణం నా సామీ రంగా టీం.. అందరూ చక్కగా సపోర్ట్ చేశారు .. టైం కి షూట్ కి వచ్చి కంప్లీట్ చేశారు . ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి అందరూ కారణం” అంటూ చాలా ఎమోషనల్ గా ఎనర్జిటిక్ గా మాట్లాడాడు నాగార్జున. ప్రెసెంట్ ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి..!