‘ కాటేరమ్మ ‘ దేవత అసలు కథ ఇదేనా.. వింటుంటేనే గుండెల్లో వణుకు వస్తుందే..

స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల నటించిన‌ మూవీ సలార్. బ్లాక్ బస్టర్ రికార్డులు సృష్టించింది. ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుని.. భారీ సక్సెస్ అందుకుంది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్లీ ఇలాంటి సాలిడ్ సక్సెస్ దక్కించుకున్నాడు. దీంతో చాలా కాలానికి సరైన హిట్ పడిందంటూ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక సలార్‌లో చాలా హైలెట్స్ ఉన్నాయి. వీటిలో కాటేరమ్మ ఫైట్ ఒకటి. ఈ డైలాగ్‌కు థియేటర్లో విజిల్స్ మోత మోగిపోయింది.

కాటేయి రమ్మ రాలేదు కానీ బదులుగా కొడుకుని పంపిందమ్మ అనే డైలాగ్ అయితే ఒక్క మాదిరిగా హైలెట్ కాలేదు. ఇక సలార్‌లో చూపించిన ఈ కాటేరమ్మ దేవత ఎవరు.. ఆమెకు ఆ పేరు ఎలా వచ్చింది అనేది చాలామందికి తెలియదు. అయితే ఆ కాటేరమ్మ‌ అసలు కథ వింటుంటే గుండెలు వణుకు పడుతుంది. ఇంతకీ అదేంటో ఒకసారి చూద్దాం. కైలాసంలో పరమశివుడు నిద్రపోయే సమయంలో పార్వతీదేవి ఎక్కడికో వెళ్తూ ఉండేదట.. ప్రతిరోజు రాత్రి టైంలో వెళ్లి సూర్యోదయం కాకముందు కైలాసానికి తిరిగి వస్తుండేదట. అది గమనించిన శివుడు.. పార్వతి దేవిని నిలదీయగా తనకు తెలియకుండానే అదంతా జరుగుతుందని పార్వతి వివరించిందట.

ఓ రోజు పార్వతి దేవిని శివుడు అనుసరించగా.. ఆమె అడవుల గుండా వెళుతూ కనిపించిందట. అయితే ఆమె ఒక్కసారిగా కాళికా రూపంలోకి మారి పాతిపెట్టి ఉన్న శవాలను బయటకు తీసి తినడానికి చూసిందట. ఉగ్రరూపంలో ఉన్న పార్వతి దేవిని ఆపేందుకు శంకరుడు మార్గమధ్యంలో పెద్ద గొయ్యను సృష్టిస్తాడట. దాంతో ఆమె అందులో పడిపోతుంది.. కాసేపటికి ఆమె తేరుకొని చేసిన దానికి పశ్చాత్తాప పడి ఉగ్రరూపాన్ని వదిలి పార్వతీదేవిగా శివుడు వెంట వెళ్లిపోయిందట. ఆమె వదిలిన ఆ ఉగ్రరూపమే కాటేరమ్మ దేవత అని చెబుతూ ఉంటారు. కర్ణాటకలోని కాటేరమ్మగా.. తమిళనాడులోని కాటేరి అమ్మన్ గా ఈమెను పూజిస్తారు. చాలామంది కాపలా దేవతగా, కొన్ని ప్రాంతాల్లో కులదేవతగా ఈమెను ఆరాధిస్తూ ఉంటారు.