యాంకర్ సుమ చేసిన సాహాయం గుర్తుచేసుకొన్ని ఎమోషనల్ అయినా బిగ్ బాస్ సోహెల్.. ఇంతకీ ఏం చేసిందంటే..?

బిగ్‌బాస్ ఫేమ్ సోహేల్‌.. సైడ్ హీరోగా, శ్రీ కానేటి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ బూట్‌ కట్ బాలరాజు. గ్లోబల్ ఫిలిమ్స్, కథ‌వేరుంట‌ది బ్యానర్ల పై సంయుక్తంగా ఈ సినిమాని సోహెల్ ప్రొడ్యూస్ చేశాడు. ఈ సినిమాలో మేఘా లేక హీరోయిన్గా నటిస్తుండగా.. సునీల్, సిరి హనుమంత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఫుల్ ఆఫ్ ఎంటర్టైనర్ గా సాగే ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ తో ఈ సినిమా రూపొందింది. ఫిబ్రవరి 2న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు.. భీమ్ సిసిరోలియో సంగీతం అందించారు.

ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పాటలకు మంచి గుర్తింపు వచ్చింది. బూట్ కట్ బాలరాజు సినిమాకి నిర్మాతగా సోహెల్ ఇప్పటికే ప‌లు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొని సందడి చేశాడు. ఈ సినిమాను ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటే ఈవెంట్స్ ప్రమోట్ చేయాలి.. అప్పుడే ప్రేక్షకులకు రీచ్ అవుతుంది.. ఇలాంటి వేడుకలను ప్లాన్ చేయాలంటే కచ్చితంగా భారీగా ఖర్చు అవుతుంది.. ముఖ్యంగా ఈవెంట్లో పాల్గొనే యాంకర్ కు అధిక మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది.. ఈ విషయంపై రీసెంట్గా సోహెల్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింటి వైరల్ అవుతున్నాయి.

బూట్ కట్ బాలరాజు సినిమా ఫిబ్రవరి 2న రిలీజ్ కానుండడంతో.. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశామని.. అందులో యాంకర్ గా సుమ ఉంటే బాగుంటుందని అనుకున్నట్లు వివరించాడు. సుమ అక్క‌తో మాట్లాడాలని మేనేజర్‌కు కాల్ చేశా.. ఆయనతో మాట్లాడుతూ ఈవెంట్‌ కోసం ఎక్కువ డబ్బులు ఇవ్వలేను కొంచెం తగ్గించండి అని కోరానని.. దాంతో సుమ‌ గారితో మాట్లాడి చెబుతాను అని ఆయన అన్నట్లు వివరించాడు. కొంత సమయానికి సుమా అక్క నుంచి కాల్ వచ్చింది.. అక్క ఈ కార్యక్రమం కోసం నేను తక్కువ డబ్బు ఇద్దామనుకుంటున్న అని చేపాన‌ని వివ‌రించాడు.

ఈ సినిమాకి ప్రొడ్యూసర్ నేనే.. అంత డబ్బు నా దగ్గర లేదు ఈ సినిమాకి నేను చాలా కష్టపడుతున్న అంటూ వివరించినట్లు సోహెల్ చెప్పుకొచ్చాడు. దీంతో వెంటనే రియాక్ట్ అయిన సుమా నీ దగ్గర డబ్బు తీసుకొను.. ఉచితంగానే చేస్తా.. లైఫ్ లో ఇంత ఎదిగిన తరువాత కూడా మీలాంటి వాళ్లకు సాయం చేయలేకపోతే వృధా.. తప్పకుండా బూట్‌క‌ట్‌ బాలరాజు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు నేను హాజరవుతాను అని సుమా చెప్పిందంటూ వివ‌రించాడు. ఇలా సుమా చేసిన స‌హాయం గుర్తుచేసుకుంటూ సోహెల్ ఎమోషనల్ అయ్యాడు.