శివాజీ తేనె పూసిన కత్తి.. బిగ్ బాస్ అమర్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..

తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షోగా బిగ్ బాస్ తెర‌కెక్కిన సంగతి తెలిసిందే. ఇటీవల ముగిసిన బిగ్‌బాస్ సీజన్ 7 కార్యక్రమంలో కంటిస్టెంట్‌లుగా పాల్గొన్న వారిలో వెండితెర నటుడు శివాజీ ఒకడు. అదేవిధంగా బుల్లితెర హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అమర్‌దీప్ చౌదరి కూడా ఈ షోలో కంటిస్టెంట్ గా వ్యవహరించాడు. వీరిద్దరూ బిగ్ బాస్ హౌస్ లో కంటిస్టెంట్లుగా చివరి వరకు కొనసాగారు. ఇక శివాజీ టాప్ 3 కంటెంట్ గా బయటకు రాగా.. అమర్ మాత్రం రన్నర్ ఆఫ్ గా నిలిచి టాప్ 2గా ఉన్నాడు. వీరిద్దరూ బిగ్ బాస్ కార్యక్రమాల్లో కొనసాగుతున్న నేపథ్యంలో ఇరువురు ఒకరిపై మరొకరు ఎన్నో విమర్శలు చేసుకున్నారు.

హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా ఇదే కంటిన్యూ చేస్తున్నారు. బిగ్‌బాస్ తర్వాత శివాజీ ఎన్నో ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేస్తున్నాడు. అయితే శివాజీ మాట్లాడుతూ దీనిగురించి సంచ‌ల‌న‌ కామెంట్లు చేశాడు. శివాజీ.. అమర్ గురించి చెబుతూ స్టార్ మా సీరియల్ బ్యాచ్ కి సపోర్ట్ చేస్తుందని.. తనకు రన్నర్ అయ్యే అర్హత కూడా లేదు కానీ అతన్ని హైలైట్ చేయడానికి అమర్‌ను రన్నరప్‌గా ఉంచారు అంటూ విమర్శలు కురిపించాడు.

ఈ వ్యాఖ్యలపై తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న అమ‌ర్‌.. శివాజీ తన గురించి ఇలా మాట్లాడారంటే నేను ఆశ్చర్యంగా ఫీల్ అవుతున్న.. హౌస్ లో ఉన్నంతసేపు ఆయన నువ్వు నాకు చాలా నచ్చావు, నచ్చవు అంటూ పొగిడేవాడు. కానీ బయటకు వచ్చిన తర్వాత తన అసలు రంగులు బయట పెడుతున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. తేనె పూసిన కత్తి అంటారు. శివాజీ కూడా అలాంటి వ్యక్తి అంటూ అమర్‌ వివరించాడు. ప్రస్తుతం అమర్ శివాజీ గురించి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఇలా ఇద్దరు బయటకు వచ్చిన తర్వాత కూడా కోల్డ్ వార్ కొనసాగిస్తున్నారు.