మహేష్ ” గుంటూరు కారం ” మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” గుంటూరు కారం “. శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకుంది.

ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ ఏమంత గొప్పగా టాక్ అందుకోలేకపోయినప్పటికీ వసూళ్లు విషయంలో మాత్రం స్ట్రాంగ్ గా నిలబడింది. ఇక ఈ మూవీ థియేటర్స్ లో ప్రస్తుతానికి బాగానే రన్ అవుతుండగా అప్పుడే ఓటీటీ రిలీజ్ డేట్ కి సంబంధించిన అప్డేట్ ఒకటి వినిపిస్తుంది.

దీని ప్రకారం ఈ మూవీ ఓటీటీ లో ఈనెల రోజుల్లోపే వస్తున్నట్లు టాక్. ఇక ఈ సినిమా ప్రీమియర్ హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా అందులో ఈ ఫిబ్రవరి 9 నుంచి సినిమా అందుబాటులో ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక దీనిపై ఇంకా అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. మరి మేకర్స్ కూడా ఈ నెలలోనే ఈ సినిమాని రిలీజ్ చేస్తారో లేదో చూడాలి మరి.