యుఎస్ఏ లో ఏకంగా అన్ని మిలియన్లతో దూసుకుపోతున్న ” హనుమాన్ “… ప్రశాంత్ వర్మ ని టేకింగ్ కి హ్యాట్సాఫ్..!

యువ నటుడు తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సాలిడ్ యాక్షన్ అండ్ ఎంటర్టైనర్ మూవీ ” హనుమాన్ “. చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఇక సంక్రాంతి బరులో గుంటూరు కారానికి పోటీగా వచ్చిన ఈ మూవీ మహేష్ సినిమానే కుప్ప కూల్చింది.

ఇక అమృత అయ్యర్ హీరోయిన్గా నటించిన ఈ మూవీని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి గ్రాండ్ లెవెల్ లో నిర్మించారు. ఇక అసలు మేటర్ ఏమిటంటే.. ఇప్పటికే అటు ఓవర్సీస్ లో హనుమాన్ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.

ఇక తాజాగా ఈ మూవీ యుఎస్ఏ లో 4 మిలియన్ డాలర్ల కలెక్షన్ అందుకుంటూ నార్త్ అమెరికాలో ఆల్ టైం టాప్ ఫైవ్ తెలుగు ఫిలిం గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. ఇక ఈ విషయాన్ని కొద్ది సేపటి క్రితంమే మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. ఇక లాంగ్ రన్ లో మరిన్ని వసూలు సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.